»Is Kangana Ranaut Acting With Prabhas In Kannappa After 15 Years
Prabhas: 15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో ప్రభాస్?
ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఓ ఊపు ఊపేస్తున్నాడు. టాక్‌తో సంబంధం లేకుండా వందల కోట్లు కలెక్షన్స్ రాబడుతున్నాడు. అయినా కూడా మరో సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో నటించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Is Kangana Ranaut acting with Prabhas in kannappa after 15 years?
Prabhas: ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్నాయి. నెక్స్ట్ మే 9న రానున్న కల్కి 2898ఏడీ పాన్ వరల్డ్ టార్గెట్‌గా రాబోతోంది. ఆ తర్వాత మారుతితో చేస్తున్న రాజాసాబ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలు కంప్లీట్ అవకముందే.. సలార్ 2, స్పిరిట్ సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు. కానీ ఈ మధ్యలో మరో పాన్ ఇండియా సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు డార్లింగ్. ప్రస్తుతం మంచు విష్ణు ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పరమేశ్వరుడి పరమ భక్తుడైన కన్నప్ప పాత్రలో విష్ణు నటిస్తున్నాడు. ఈ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఇక కన్నప్పలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నాడనే న్యూస్ బయటికి రావడంతో.. అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమాతో ప్రభస్ శివుడి పాత్రలో కనిపించనున్నట్టు సమచారం. అయితే ప్రభాస్‌కు జోడిగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ విషయంలో చర్చ జరుగుతోంది. పార్వతి దేవిగా నయనతార కనిపించనుందని ముందు నుంచి ప్రచారంలో ఉంది. కానీ ఇప్పుడు ప్రభాస్‌కు జోడిగా కంగనా రనౌత్ పార్వతి పాత్రలో కనిపించనుందని తెలుస్తోంది. గతంలో ప్రభాస్, కంగనా.. ఏక్ నిరంజన్ సినిమాలో నటించారు. అయితే.. పూరి జగన్నాత్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఇక ఇప్పుడు దాదాపు 15 ఏళ్ల తర్వాత ప్రభాస్, కంగనా కలిసి నటించడానికి రెడీ అయినట్టుగా సమాచారం. దీంతో కన్నప్ప పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి.