Alexei Navalny: ఇటీవల రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నవాల్నీ(Alexei Navalny) జైల్లో అనుమానాస్పదంగా మృతి చెందారు. దీంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై ప్రజలు ఆగ్రహ ఆందోళనలను వ్యక్తం చేస్తున్నారు. అక్కడి అతి శీతల ఉష్ణోగ్రతల్ని తట్టుకుని మరీ రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. నవాల్నీ మృతితో స్థానికంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. అలాగే ‘పుతిన్ కిల్స్’ అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తున్నారు.
నవాల్నీ మృతిపై ఒక్క రష్యాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో ఈఫిల్ టవర్ దగ్గర కూడా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంతాపం వ్యక్తం చేశారు. అలాగే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో పాటు ప్రతిపక్ష నేత డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయంపై స్పందించారు. ఆయన మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు.
నవాల్నీ కుటుంబ సభ్యుల్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Biden) సైతం కలిసి పరామర్శించారు. అమెరికా కాలిఫోర్నియాలోని ఓ హోటల్లో నవాల్నీ సతీమణి యులియా, కుమార్తె దాశా లతో సమావేశం అయ్యారు. నవాల్నీ మృతి తీరని లోటని బైడెన్ అన్నారు. ఆయన ధైర్యం కుటుంబ సభ్యుల్లో కొనసాగాలన్నారు. అయితే తన కుమారుడి మృతదేహాన్ని రహస్యంగా ఖననం చేయాలని రష్యా అధికారులు కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తున్ననారు. అంతిమ యాత్ర సైతం లేకుండా అంతా రహస్యంగా జరగాలని వారు అంటున్నారని నవాల్నీ తల్లి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఈయన మృతితో అమెరికా రష్యాపై మరిన్న ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.