త కొన్ని రోజుల నుంచి ఎర్ర సముద్రంలో హూతీలు దాడులు చేస్తున్నారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై నిన్న హూతీలు దాడులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ఈ విషయాన్ని తెలిపారు.
Red Sea: గత కొన్ని రోజుల నుంచి ఎర్ర సముద్రంలో హూతీలు దాడులు చేస్తున్నారు. అమెరికాకు చెందిన రెండు యుద్ధ నౌకలపై నిన్న హూతీలు దాడులు చేశారు. ఆ సంస్థ ప్రతినిధి యహ్యా సరెయ ఈ విషయాన్ని తెలిపారు. నౌకా విధ్వంసక క్షిపణులు, డ్రోన్ల సాయంతో రెండు డెస్ట్రాయర్లపై దాడులు నిర్వహించారు. యూఎస్ఎస్ కార్ని లక్ష్యంగా ప్రయోగించిన వీటిని అమెరికా దళాలు ఎదురు దాడి చేసి యెమెన్ భూభాగంలోని మూడు క్షిపణులు, డ్రోన్లను ధ్వంసం చేశాయి. రెండు రోజుల కిందట ఎంఎస్సీ స్కై 2 వాణిజ్య నౌకపై దాడి జరిగింది. సాయం చేయమని భారత నౌకాదళానికి కాల్ వచ్చింది. ఆ వాణిజ్య నౌకలో మొత్తం 23 మంది సిబ్బంది ఉండగా అందులో 13 మంది భారతీయులే ఉన్నారు.
ఎర్ర సముద్రంలో మూడు డేటాకేబుల్స్ తెగిపోయాయని టెలికం సంస్థలు తెలిపాయి. దీంతో ఆసియా, ఐరోపా మధ్య దాదాపు 25 శాతం డేటా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రమాదం ఉంది. హెచ్‌జీసీ గ్లోబల్ కమ్యూనికేషన్ స్పందిస్తూ ఆ ట్రాఫిక్‌ను వేరే కేబుల్స్‌కు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. అయితే అవి ఎలా తెగిపోయాయో అని మాత్రం వెల్లడించలేదు. సముద్రం అడుగున ఏర్పాటుచేసిన డేటా కేబుల్సే ఇంటర్నెట్ను నడిపించే అదృశ్య శక్తి. గత కొన్నేళ్లుగా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా వంటి కంపెనీలు దీనిలో భారీ ఎత్తున నిధులను పెట్టుబడిగా పెట్టాయి. ఈ కేబుల్స్ దెబ్బ తింటే ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుంది. 2006లో తైవాన్ భూకంపం సందర్భంగా ఒకసారి ఈ కేబుల్స్ దెబ్బతిని ఇంటర్నెట్ సేవల్లో ఇబ్బందులు తలెత్తాయి.