Massive wildfires burning in Texas : అమెరికాలో కార్చిచ్చులు ఏటా చాలా చెట్లను, అటవీ సంపదను బూడిద చేసేస్తుంటాయి. ప్రస్తుతం అక్కడి టెక్సాస్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున కార్చిచ్చు(wildfire) అలుముకుని ఉంది. లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లను బూడిద చేసేస్తోంది. సోమవారం మధ్యాహ్నం చిన్నగా ప్రారంభం అయ్యిన ఈ కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తూ ఉంది. ఎండున గట్టికి గాలి తోడవడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి.
ఈ కార్చిచ్చు కారణంగా అక్కడ ప్రమాదంలో ఉన్న గ్రామాలను ప్రభుత్వం ఖాళీ చ ఏయించిమది. ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబాట్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అక్కడ దాదాపుగా 60 కౌంటీల్లో దీన్ని విపత్తుగా ప్రకటించారు. దాదాపుగా 780 కిలోమీటర్ల పరిధిలో ప్రస్తుతం ఈ మంటలు ఉన్నాయి. దాదాపుగా రెండు లక్షల ఎకరాల్లో ఉన్న చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు దగ్ధం అయిపోతూ అగ్ని కీలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి.
ఈ విషయమై టెక్సాస్(Texas) రాష్ట్ర గవర్నర్ ప్రజలను హెచ్చరించారు. అంతా చాలా అప్రమత్తంగా ఉండాలని ఇతర పనులను పక్కనబెట్టాలని కోరారు. వేర్వేరు ప్రాంతాలకు మంటలు అంటుకుండటంతో అంతా దీనిపై దృష్టి ఉంచాలని కోరారు. ఇక్కడ కొన్ని జాతీయ రహదారుల దగ్గర కూడా అగ్ని ఎగసి పడుతుండటంతో కొన్ని రహదారులను మూసి వేశారు. ప్రస్తుతం ఓ మంటలు టెక్సాస్ నుంచి ఓక్లహోమాకు కూడా పాకాయని సమాచారం.