చిలీలో కార్చిచ్చు 13 మంది ప్రాణాలను బలిగొంది. 11 మంది మంటలకు ఆహుతి కాగా.. మంటలను ఆర్పే క్రమంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. బయోబియోలో గల శాంతా జువానా అటవీ ప్రాంతంలో మంటల ప్రభావం ఎక్కువగా ఉంది. పొరుగున గల నబుల్పై కూడా ఇంపెక్ట్ ఉంది. ఆ రెండు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని విపత్తుగా ప్రకటించారు. వేసవి వేడిగాలులతో మంటలు చేలరేగాయి. అధ్యక్షుడు గాబ్రియల్ మాత్రం ఎవరో నిప్పు పెట్టారని అనుమానం వ్యక్తం చేశారు. దేశంలో 14 వేల హెక్టార్ల అటవీప్రాంతంలో మంటలు వ్యాపించాయి. దేశంలో 39 చోట్ల మంటలు చెలరేగగా.. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి.
కార్చిచ్చు క్రమంగా విస్తరించడంతో అత్యవసర సహాయక చర్యలు చేపట్టేందుకు వ్యవసాయ శాఖ సిబ్బంది హెలికాప్టర్లో బృందాన్ని పంపించింది. దక్షిణ భాగంలో గల లా ఆరౌకానియ వద్ద హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యింది. ఫైలట్ సహా మెకానిక్ చనిపోయారు. వీరిద్దరితో కలిపి మొత్తం 13 మంది చనిపోయారు.
కార్చిచ్చుతో వందలాది నివాసాలు దగ్దం అయ్యాయని అంతర్గత మంత్రిత్వ శాఖ కారొలినా తోహ వెల్లడించారు. కొద్ది రోజుల్లో పరిస్థితి మరింత క్షీణించనుందని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే 63 విమానాల్లో ద్వారా మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తమకు బ్రెజిల్, అర్జెంటినా సాయం చేస్తున్నామని భావిస్తున్నామన్నారు.
చిలీలో కార్చిచ్చు నేపథ్యంలో అధ్యక్షుడు గాబ్రియల్ బొరిస్ తన వేసవి పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని స్వదేశం వచ్చేశారు. ప్రమాదం జరిగిన న్యూబెల్, బయోబయో రాష్ట్రాల్లో పర్యటించారు. ఇక్కడ దాదాపు 20 లక్షల మంది జనం ఉంటున్నారు. ప్రజలకు అత్యవసర సేవలు నిరంతరాయంగా అందుతాయని, తాము ఒంటరి అని భావించకూడదని ఒక ప్రకటనలో తెలిపారు. ఇదీ ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పని కార్చిచ్చుపై అనుమానం వ్యక్తం చేశారు. న్యూబెల్ రాష్ట్రంలో శుక్రవారం 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.