టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు.
టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే... అంతకన్నా... ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
ఎంటర్‌టైన్‌మెంట్ దిగ్గజం, అతిపెద్ద మల్టీమీడియా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ డిస్నీ(Disney )సంస్థ 7,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాబ్ ఐగెర్(Bob Iger) బుధవారం నాడు ఈ మేరకు ప్రకటించారు. డిస్నీ కంపెనీ తన పని నిర్మాణాన్ని పునర్వ్యవస్థీకరించడం, ఖర్చులను తగ్గించడానికి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. తిరిగి రాగానే.. అమెరికా సహా ప్రపంచవ్య...
టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి.
టర్కీ, సిరియా భూకంప విలయం ధాటికి మరణాల సంఖ్య వేగంగా పెరుగుతుంది. ఇప్పటివరకు బాధిత మృతుల సంఖ్య 8,300కి చేరిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొన్నారు. ఈ క్రమంలో సిరియాలో 2,400 మందికి పైగా మరణించినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఇరు దేశాల్లో ఏటు చూసినా కూలిన భవనాలు, కుప్పలు కుప్పలుగా ఉన్న శవాలతో హృదయవిదారక దశ్యాలే కనిపిస్తున్నాయి. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నా కూడా శిథిలాలను తొలగిస్తున్న కొద...
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గూగుల్ నుంచి మొదలుకొని చిన్న కంపెనీల వరకు కాస్ట్ కటింగ్ బాట పట్టాయి. ఆర్థిక మాంద్యం, మార్కెట్ ప్రభావం నేపథ్యంలో తొలగిస్తున్నాయి. రోజు ఓ కంపెనీ తమ ఉద్యోగులను తొలగించి ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. తాజాగా అమెరికన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కంపెనీ జూమ్ కాస్ట్ కట్ చేసింది. తమ కంపెనీలో 15 శాతం ఉద్యోగులను తొలగించింది. మొత్తం 1,300 మంది ఉద్యోగులను ఇ...
పాకిస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో గల కోహిస్థాన్ జిల్లా కారకోరం హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. తర్వాత అవీ లోయలోకి పడిపోయాయి. ఎదురుగా వస్తున్న కారును గిల్గిట్ నుంచి రావల్పిండికి వస్తోన్న ప్రయాణికుల బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు చనిపోయారు. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ...
భారత సంతతికి చెందిన అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్(13)(Natasha Perianayagam) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా ఎంపికైంది. ఆమె తాజా ప్రయత్నంలో అత్యధిక మార్కులు సాధించి రికార్డు సృష్టించింది. పరీక్షలకు 76 దేశాల నుంచి హాజరైన 15,300 మంది అభ్యర్థులలో 27 శాతం కంటే తక్కువ మంది అర్హత సాధించగా..నటాషా మాత్రం టాప్ లో నిలిచింది. ఈ పోటీలను యునైటెడ్ స్టేట...
ప్రపంచమంతా భయపడేలా.. టర్కీ, సిరియా దేశాల్లో భూకంపం తన ప్రతాపాన్ని చూపించింది. ప్రకృతికి కోపం వస్తే ఇలా ఉంటుంది అన్నట్టుగా టర్కీ, సిరియాను భారీ భూకంపం నాశనం చేసింది. పేక మేడల్లా కూలుతున్న భారీ బిల్డింగ్‌లను చూసి జనాలే భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. టర్కీలో 7.8 తీవ్రతతో పలు సార్లు భూకంపం సంభవించడంతో పెద్ద పెద్ద భవనాలన్నీ నేలమట్టం అయ్యాయి. దీంతో వేల మంది మృత్యువాత పడ్డ...
నిండా పద్దెనిమిదేళ్లు కూడా నిండలేదు. వందల కోట్లకు పడగలెత్తింది. పుట్టిన రోజు కోసం ఏం కొందామో తెలియక పొరపాటున కొన్న లాటరీ టికెట్ ఆమెను కోటీశ్వరాలిని చేసేసింది. తాత చెప్పిన మాటతో కొన్న లాటరీ టికెట్ తో ఆమెకు రూ.290 కోట్లు దక్కాయి. అదృష్టమంటే ఈ అమ్మాయిదే కదా. అయితే వచ్చిన ఆ డబ్బుతో ఆమె మెర్సిడెస్ బెంజ్ కార్లు, అత్యంత విలాసవంతమైన బంగ్లా కొనడంతో పాటు భవిష్యత్ దృష్ట్యా కొన్ని కోట్లు పెట్టుబడిగా పెట్టే...
టర్కీ, సిరియాలలో భారీ భూకంపం కారణంగా వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్నోవేల మందికి గాయాలయ్యాయి. భూకంపం దాటికి ఈ దేశాలు కకావికలమయ్యాయి. భవనాలు కుప్పకూలాయి. ఎటు చూసినా హృదయవిదారక దృశ్యాలే. శిథిలాల కింద ఉన్నవారిని రక్షించేందుకు, చనిపోయినవారిని తీసేందుకు రెస్క్యూ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. కూలిపోయిన భవనాల కింద వేలాదిమంది ఉండవచ్చునని భావిస్తున్నారు. ఇలాంటి పరిస...
బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ప్రధాని మోదీ కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు రోజుల క్రితం టర్కీ, సిరియాలలో భారీ భూకంపం సంభవించి వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అక్కడ మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. కాగా… ఈ ఘటన పట్ల ఆయన భావోద్వేగానికి గురయ్యారు. అంతేకాకుండా 2001లో గుజరాత్ లో జరిగిన భూకంపాన్ని తలుచుకొని ఆయన కన్నీళ్లు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ మనోజ్ తివ...
టర్కీ, సిరియా దేశాలను భూకంపం వణికిస్తోంది. ఈ రెండు దేశాల్లో ఫిబ్రవరి 6, 7వ తేదీల్లో వచ్చిన భూకంపాలతో 5000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రకృతి సృష్టించిన ఈ ఘోర విపత్తులో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. భారీ భూకంపం నేపథ్యంలో మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశమున్నట్లు డబ్ల్యుహెచ్ఓ తెలిపింది. టర్కీలో 4వేల మందికి పైగా, సిరియాలో 1500 మంది వరకు మృత్యువాత పడినట్లుగా చెబుతున్నారు. పాతికవేలమంది వరకు గాయ...
అమెరికాలో జరిగిన తుపాకీ మిస్ ఫైర్ జరిగిన ఘటనలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. సెక్యూరిటీ గార్డు తన తుపాకీని పరిశీలిస్తున్న క్రమంలో పొరపాటున రివాల్వర్ ను తాకడంతో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి తలలోకి బుల్లెట్టు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో ఘటన స్థలంలోనే అతడు కన్నుమూశాడు. ఈ ఘటనతో మధిర పట్టణంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖమ్మం జిల్లా మధిర పట్టణానికి చెంది...
ప్రతి ఏటా విదేశాల్లో చదువుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 2022లో 7,50,365 మంది భారతీయ విద్యార్థులు.. చదువు కోసం విదేశాలకు వెళ్లారని ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ వెల్లడించారు. గత 6 ఏళ్లల్లో మొత్తం మీద 30 లక్షల మంది విదేశాలకు వెళ్లినట్లు ప్రకటించారు. 2021లో 4,44,553 మంది విదేశాలకు వెళ్లిన విద్యార్థులతో పోలిస్తే 2022లో విదేశాలకు వెళ్లిన వ...