టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి.
టర్కీ (Turkey), సిరియా(Syria) ప్రాంతాల్లో భారీ భూకంపం(Earthquake) సృష్టించిన విలయంతో ఆ ప్రదేశం అంతా శవాట గుట్టలుగా మారింది. ఇప్పుడు టర్కీలో ఎటుచూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తాయి. వేలాది భవనాలు కుల్పకూలి సమాధులను తలపిస్తున్నాయి. శిథిలాల కింద నుంచి మృతదేహాల్ని అధికారులు వెలికి తీస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రకృతి విలయంతో మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే దాదాపు 11 వేల మంది మృత్యువాతపడినట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీగా మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి.
టర్కీ(Turkey)లోనే 8,754 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రకటించారు. ఇకపోతే సిరియా(Syria)లో మొత్తంగా 2470 మంది ప్రాణాలు విడిచారు. మొత్తంగా ఇప్పటి వరకూ కూడా 11,224 మంది మృతిచెందారు. మరోవైపు గాయపడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా కూడా దాని కింద ప్రాణం లేని దేహాలే కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. మరోవైపు శిథిలా కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్నవారిని గుర్తించి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Turkey-Syria Earthquake; Fatalities ratio crosses 11,200+ & 49,133 injured while 4000+buildings collapsed as a result of world’s deadliest #earthquake in #Turkey over a decade. Rescue crews are looking for survivors still trapped under the rubble in frigid cold.#TurkeyEarthquakepic.twitter.com/IBKBXi8RDZ
భారీ భూకంపం(Earthquake) వల్ల కుటుంబాలకు కుటుంబాలే ప్రాణాలను కోల్పోయాయి. విపత్తుతో అల్లాడుతున్న ప్రాంతాలకు మరింత సహాయం అందించాలంటూ టర్కీ(Turkey) అధ్యక్షుడు ఎర్డోగాన్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ వినాశనం తీవ్రత అధికంగా ఉండటంతో ఇప్పటికీ అనేక మంది బాధితులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 20కి పైగా దేశాల నుంచి సహాయక బృందాలు భూకంప తీవ్రత ప్రాంతాలకు చేరుకుని తమ సహాయాన్ని అందిస్తున్నాయి.
భూకంప(Earthquake) ప్రభావిత జోన్లో ప్రస్తుతం దాదాపు 60,000 మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇంకోవైపు ఈ ప్రకృతి వినాశనం వల్ల మృతుల సంఖ్య 20 వేలు దాటే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(who) అంచనా వేస్తోంది. ఈ భూకంపం(Earthquake) తీవ్రతకు టర్కీ(Turkey) లోని మొత్తం 85 మిలియన్ల జనాభాలో 13 మిలియన్ల మంది ప్రభావితమైనట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డోగాన్ తెలిపారు. భూ విలయం(Earthquake) తీవ్రత అధికంగా ఉన్న 10 ప్రావిన్స్‌ల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించనున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల నుంచి 3.8 లక్షల మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిబిరాల వద్దకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.