టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు.
టర్కీ (Turkey), సిరియా(Syria)లో భూకంప(Earthquake) మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఉంది. రెండు దేశాల్లో ఘోర భూకంపాలు సంభవించాయి. భూకంపాల వల్ల ఇప్పటి వరకూ 15 వేలకుపైగా ప్రజలు మృతి చెందారు. భూకంపం(Earthquake) వల్ల అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాలను అధికారులు తొలగిస్తూ ఉంటే మృతదేహాలు గుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. సోమవారం సంభవించిన భూకంపం(Earthquake) వల్ల టర్కీ(Turkey)లో ఇప్పటి వరకూ 12,391 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా సిరియా(Syria)లోనూ 2992 మంది మృతదేహాలను అధికారులు వెలికితీశారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిలో ఇప్పటి వరకూ 60 వేల మందికిపైగా ప్రజలను సహాయ బృందాలు కాపాడాయి. సహాయక చర్యలు గత 72 గంటల నుంచి సాగుతున్నాయి. మూడు రోజులు కావస్తున్న తరుణంలో శిథిలాల కింద చిక్కుకున్న వారు ఇక ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అందరూ భావిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. శిథిలాలతో పాటుగా గడ్డకట్టిన మంచు కింద చిక్కుకొని ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నట్లు అధికారులు గుర్తించారు.
టర్కీ(Turkey), సిరియా(Syria)లో భూకంపం(Earthquake) వల్ల గాయపడిన వారి సంఖ్య వేలల్లోనే ఉంది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఏ రాయిని కదిపినా కూడా దాని కింద ప్రాణం లేని దేహాలే కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు శిథిలా కింద ఊపిరాడక ప్రాణం కోసం పోరాడుతున్నవారిని గుర్తించి అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. వరుస భూకంపాల(Earthquake) నేపథ్యంలో టర్కీ(Turkey) ప్రాంతం మొత్తం శవాల గుట్టలుగా మారింది. ఎక్కడ చూసినా హృదయవిదారకర పరిస్థితి నెలకొంది. ప్రతి చోటా కన్నీటి శోకాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు టర్కీ(Turkey), సిరియా(Syria)లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఇప్పటికే ప్రపంచ దేశాల నుంచి స్వచ్ఛంద సంస్థలు బయల్దేరాయి. భూకంపం(Earthquake) వల్ల తీవ్రంగా దెబ్బతిన్నవారిని, గాయాలైనవారిని ఆస్పత్రిలో చేర్చి చికిత్సను అందిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థావరాల్లో ఉంచి ఆహారాలు అందిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు టర్కీ(Turkey), సిరియా(Syria) ప్రజల శాంతి కోసం వేడుకుంటోంది.