టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.... ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే... అంతకన్నా... ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
టర్కీ, సిరియా దేశాల్లో ఇటీవల భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. కాగా…. ఈ భూకంప ధాటికి దాదాపు 15వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. రెండు దేశాలు కలిపి 15,383 మంది చనిపోయారంటూ అధికారులు చెబుతున్నారు. అయితే… అంతకన్నా… ఎక్కువ మందే చనిపోయి ఉంటారని తెలుస్తోంది.
తమ దేశంలో 12,391 మంది మృతి చెందారని, సుమారు 63 వేలమంది గాయపడ్డారని టర్కీ డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజన్సీ ప్రకటించినట్టు అనడోలు వార్తా సంస్థ తెలిపింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో ఆరువేలకు పైగా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.
టర్కీలోని ఖారన్ మన్ మారాస్, హతాయ్, ఉస్మానియె, మలత్యా వంటి దాదాపు 10 నగరాల్లో 13 మిలియన్లకు పైగా ప్రజలు ఈ పెను విలయానికి గురయ్యారు. శీతల గాలులు, వణికిస్తున్న చలి, తరచూ పడుతున్న వర్షం.. సహాయక చర్యలకు తీవ్ర అవరోధం కలిగిస్తున్నాయి.
మరో మూడు నెలల్లో అధ్యక్షుడు ఎర్డోగన్ .. అధ్యక్ష ఎన్నికలను ఎదుర్కోనున్న తరుణంలో ఈ భూకంపం ఆయన రాజకీయ జీవితానికి సవాలుగా నిలిచింది. మే 14 న టర్కీ అధ్యక్ష పదవికి, పార్లమెంటుకు ఎన్నికలు జరగాల్సి ఉంది. 2003 నుంచి ఈ దేశానికి అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న ఆయన ఈ ‘డిజాస్టర్’ లో చిక్కుకుపోయారు. ఇక ఇండియా నుంచి సహాయ సామగ్రితో కూడిన ఆరో విమానం టర్కీ చేరింది.