పాకిస్థాన్‌లో గల కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు చొరబడ్డారు. ఆ ఆఫీసు షేర్షియా ఫైసల్ వద్ద ఉండగా.. సాయుధులు చొరబడి కాల్పులు ప్రారంభించారు. పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని జియో న్యూస్ రిపోర్ట్ తెలిపింది.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల క్రితం టర్కీ, సిరియా(Turkey, Syria)లో భూకంపం సంభవించింది. వేలాది మంది మృతి చెందారు. ఆ సంఘటన నుంచి కోలుకోని సిరియా(Syria)లో మళ్లీ భూకంపం సంభవించింది.
వీడియో స్ట్రీమింగ్ సంస్థ యూట్యూబ్ (YouTube)కు ఇండియన్ అమెరికన్ నీల్ మోహన్ (Neal Mohan) సీఈవోగా నియమించబడ్డారు. ఈ సోషల్ మీడియా దిగ్గజానికి సూసన్ వొజిసికి (Susan Wojcicki) సుదీర్ఘకాలం అంటే తొమ్మిదేళ్ల పాటు సీఈవోగా పని చేశారు. ఇప్పుడు ఆమె వైదొలగడంతో నీల్ మోహన్‌ను నియమించింది.
అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
ICC-Team India : టీమిండియాకు ఐసీసీ ఊహించని షాక్ ఇచ్చింది. టెస్టు ర్యాంకింగ్ విషయంలో ఐసీసీ చేసిన తప్పుతో... టీమిండియా మొదటి స్థానం నుంచి చేజారింది. టీమిండియా అగ్రస్థానంలో ఉందని ప్రకటించిన కొద్ది గంటలకే తన తప్పును తెలుసుకుంది. ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉందని, భారత్ రెండో స్థానాల్లో ఉందని వెల్లడించింది.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.
కరోనా మహమ్మారి సృష్టించిన విస్ఫోటనం నుంచి మానవ జాతి ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. కరోనా భయానకం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో వైరస్ వణికిస్తోంది. భూమికి మరో వైరస్ ముప్పు పొంచి ఉంది. ఆ వైరస్ పేరు మార్ బర్గ్ వైరస్ డిసీ (Marburg Virus Disease- MVD). ఈ వైరస్ ఇప్పటికే మానవ జాతికి సోకింది.
టర్కీ, సిరియాలో భూకంపం కారణంగా ఇబ్బందులు పడుతున్న బాధితులకు ప్రముఖ చెఫ్ నస్ర్-ఎట్ గోక్సే ప్రతి రోజు 5 వేల మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. సాల్ట్ బే(salt bae)గా ఫేమస్ అయిన ఈ చెఫ్ చేస్తున్న సాయం పట్ల పలువురు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.
నిన్నటి గెలుపుతో టెస్టుల్లోను ఆస్ట్రేలియాను దాటిందని ఐసీసీ వెబ్ సైట్ చూపించింది. అయితే ఐసీసీ వెబ్ సైట్ సాంకేతిక సమస్య కారణంగా భారత్ టెస్టుల్లోను అగ్రస్థానానికి చేరుకుంది. నిజానికి ఆస్ట్రేలియాను ముందు నిలిచింది. దీనిని గుర్తించిన ఐసీసీ తన వెబ్ సైట్‌ను కరెక్ట్ చేసింది.
ఇండియా పురుషుల క్రికెట్ జట్టు అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా ICC టెస్ట్ ర్యాంకింగ్స్ లలో మెన్స్ టీమిండియా జట్టు అన్ని ఫార్మాట్లలో ఐసీసీ వరల్డ్ నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ఎలాన్ మస్క్ (Elon Musk) తాజాగా చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అదే సమయంలో వివాదాస్పదంగానూ కనిపిస్తోంది. తన పెంపుడు కుక్క ప్లోకీని ట్విట్టర్ సీఈవో కుర్చీలో కూర్చోబెట్టారు.
బట్టతల ఉందని ఓ వ్యక్తిని ఉద్యోగం నుండి తొలగించగా, అది కంపెనీకి గట్టి షాక్ తగిలింది. చివరకు అతనికి భారీ మొత్తంలో జరిమానా రూపంలో చెల్లించవలసి వచ్చింది. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లో జరిగింది.
ఇలాంటి విన్యాసాలు, సాహసాలు చాలా నమోదయ్యాయి. కాకపోతే జంటలు తమ వ్యక్తిగత ప్రైవసీ నేపథ్యంలో వీటిని బహిర్గతం చేయలేదు. కాగా భూతల స్వర్గంగా మాల్దీవులు దీవులు పేరు గాంచాయి. సుందరమైన ప్రదేశాలు, నీటి అందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున మాల్దీవులకు వెళ్తున్నారు. మన దేశానికి చెందిన సినీ నటీనటులు, ప్రముఖులు అక్కడకి వెళ్లి సేద తీరి వస్తున్నారు.
అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ కార్యాలయాల్లో (BBC) వరుసగా రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ (Income Tax department) అధికారులు సర్వే చేస్తున్నారు. పన్ను ఎగవేతకు పాల్పడుతోందనే అనుమానంతో ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాల్లో ఈ సర్వే నిర్వహిస్తున్నారు.
కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది.