Earthquake: సిరియాలో మళ్లీ భూకంపం..41 వేలు దాటిన మృతుల సంఖ్య
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. పది రోజుల క్రితం టర్కీ, సిరియా(Turkey, Syria)లో భూకంపం సంభవించింది. వేలాది మంది మృతి చెందారు. ఆ సంఘటన నుంచి కోలుకోని సిరియా(Syria)లో మళ్లీ భూకంపం సంభవించింది.
వరుస భూకంపాలు(Earthquakes) ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారు. పది రోజుల క్రితం ప్రకృతి విలయతాండవం చేసింది. టర్కీ, సిరియా(Turkey, Syria)లో భూకంపం సంభవించింది. ఆ ఘటన వల్ల వేలాది మంది మృతి చెందారు. ఆ సంఘటన నుంచి కోలుకోని సిరియా(Syria)లో మళ్లీ భూకంపం సంభవించింది. గురువారం రాత్రి 10.47 గంటలకు మరోసారి సిరియా(Syria)లో భూమి కంపించింది. ఇడ్లిబ్ ప్రావిన్స్ లో భూమి కంపించిందని(Earthquake), తీవ్రత 5.4గా నమోదైందని సిరియా(Syria) జాతీయ భూకంప కేంద్రం తెలిపింది.
సిరియా(Syria)లో సంభవించిన భూకంపం(Earthquake) తీవ్రత వల్ల రాజధాని డమాస్కస్, ఉత్తర ప్రావిన్స్ అలెప్పోలో కూడా ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. భూమి అంతర్భాగం 18.8 కిలో మీటర్ల లోతులో కదలికలు సంభించాయని అధికారులు వెల్లడించారు. ఇడ్లిబ్ నగరానికి 61 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 30 నిమిషాల వ్యవధిలోనే వాయువ్య తీర ప్రావిన్స్ అయిన లటాకియాలో కూడా భూకంపం(Earthquake) వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
The death toll of the Turkey-Syria earthquake has reached a staggering 19,000. Thousands are still stuck beneath the ruins. Take a look at the tragedy & devastation in Turkey's Hatay province:pic.twitter.com/SjB93rNs3J
అదేవిధంగా రాత్రి 11.17 గంటలకు 3.4 తీవ్రతతో సిరియా(Syria) ప్రాంతంలో మరోసారి భూమి కంపించింది. లటాకియాకు 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 46 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపణలు(Earthquake) చోటుచేసుకున్నాయని వెల్లడించారు.
#Syria Syria was the most industrialized Arab country, but due to the presence of ISIS and sanctions, its economy and industry have weakened so much that now, it doesn't have the minimum tools to save the lives of its citizens in this earthquake. pic.twitter.com/Phf0Rcj6HJ
ఫిబ్రవరి 6వ తేదిన టర్కీ(Turkey), సిరియా(Syria)లో భారీ భూకంపం(Earthquake) సంభవించగా వేలాది మంది ప్రాణాలు విడిచారు. ఆ ఘటన వల్ల ఇప్పటి వరకూ 41732 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో టర్కీలోనే 38,044 మంది మరణించారు. అలాగే సిరియా(Syria)లో 3688 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా సిరియా(Syria) ప్రధాన భూభాగంలో 1414 మంది మరణించారని, 2357 మంది గాయాలపాలైనట్లు సిరియా ఆరోగ్య శాఖ వెల్లడించింది.