Marburg Virus : మరో కొత్త వైరస్ వ్యాప్తి.. 9 మంది మృతి
కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది.
కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అల్లాడిపోయింది. ఇప్పుడిప్పుడే ఆ వైరస్ నుంచి మెల్లమెల్లగా కోలుకుంటున్న ప్రపంచం మరో వైరస్ తో ఉలిక్కి పడింది. ఈక్వటోరియల్ గినియాలో మార్ బర్గ్ వైరస్ (Marburg Virus) కలకలం రేపింది. ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మంగళవారం వెల్లడించింది. చాలా ప్రమాదకరమైన ఈ వైరస్‌లోనూ ఎబోలా (Ebola) లక్షణాలుంటాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వైరస్ సోకినవారికి జ్వరంతో పాటు తరచుగా రక్తస్రావం (Hemorrhagic Fever) అవుతుంటుంది. అలాగే వారి శరీర సామర్థ్యం చాలా వరకూ తగ్గిపోతుంది. వైరస్ నివారణకు ప్రత్యేక వైద్య బృందాలను గినియాకు పంపినట్టు డబ్ల్యూహెచ్ఓ(WHO) ప్రకటించింది.
ఈ వైరస్ సోకిన రోగులకు అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపించినట్లు ఆరోగ్య నిపుణులు తెలిపారు. ప్రాణాంతకమైన ఈ కొత్త వైరస్ (New Virus) వ్యాప్తి చెందిన ప్రావిన్సులను క్వారంటైన్ చేశామని ఈక్వటోరియల్ గినియా (Equatorial Guinea) ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఆఫ్రికా మధ్య పశ్చిమ తీరంలో గాబన్, కామెరూన్ సరిహద్దులకు సమీపంలోని దట్టమైన అటవీ తూర్పు ప్రాంతంలో రక్తస్రావ జ్వరంతో కొన్ని కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఆ దేశ సర్కార్ గత వారమే ప్రకటించింది.
కీ-ఎన్‌టెమ్‌లో ఈ వైరస్ సోకి ఇప్పటి వరకూ 4,325 మంది ఇబ్బందులు పడ్డారని, జనవరి 7 నుంచి ఫిబ్రవరి 7వ తేది మధ్యలో ఈ వైరస్ వల్ల చాలా మంది తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వైరస్ వల్ల ఇప్పటి వరకూ 9 మంది మరణించారు. వీరి రక్త నమూనాల్లో మార్బర్గ్ వైరస్ నిర్ధారణ అయినట్లు వైద్యులు గుర్తించారు. ఆఫ్రికాలో గతంలో ఎబోలా అనే వైరస్ (Virus) ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఆ వ్యాధి వల్ల చాలా మంది ప్రాణాలు వదిలారు. తాజాగా వెలుగు చూసిన కొత్త వైరస్(New Virus)లో ఎబోలా లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని వైద్యులు ప్రకటించారు. ఎబోలా(Ebola) కొత్త రూపం మార్బర్గ్ ప్రబలుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ(WHO) హైఅలర్ట్ ప్రకటించి తమ సిబ్బందితో పలు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఈ వైరస్ గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తూ వారి శరీర శక్తిని పూర్తిగా నశింపజేసేలా చేస్తుంది. అలాగే, వైరస్(Virus) సోకినవారితో ప్రత్యక్ష సంబంధం, సన్నహితంగా మెలిగినా లేదా శరీర ద్రవాలు ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌ను అరికట్టే టీకాలు లేదా చికిత్సలు ఇంకా అందుబాటులోకి రాలేదని, అయినా కూడా ప్రాణాపాయం నుంచి కాపాడే పలు విధానాలు అందుబాటులో ఉన్నట్లు వైద్యులు తెలిపారు.