ఓ వ్యక్తి తనను చూసి నవ్వారని ఏడుగురిని కాల్చి చంపాడు(Gunmen Kills 7). ఆటలో ఓడిపోవడం చూసి నవ్వారని ఇద్దరు వ్యక్తులు ఏడుగురిని కాల్చి(Gunmen Kills 7) చంపేశారు. ఈ షాకింగ్ ఘటన బ్రెజిల్(Brazil) లోని సినాప్ నగరంలో చోటుచేసుకుంది.
స్వల్ప ఘటన కావడంతో బైడెన్ కు గాయాలేమీ కాలేదు. అయితే బైడెన్ ఎయిర్ ఫోర్స్ వన్ లో ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి పడడం ఇది మూడోసారి. అంతకుముందు 2021లో జార్జియా నుంచి బయల్దేరే సమయంలో అదుపు తప్పి జారి పడిపోయారు. అయితే వెంటనే తేరుకున్నారు.
చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఓ ఒపెన్ కాస్ట్ మైన్ కూప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో 50 మంది గల్లంతయ్యారు. సమాచారం తెలుసుకున్న అధికారులు గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపడుతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త అయిన రామస్వామి ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా తాను కూడా బరిలోకి దిగనున్నట్లు తెలిపారు. ఇప్పటికే నిక్కీ హేలీ బరిలో నిలుస్తున్నట్లు తెలిపారు.
వివిధ కంపెనీల్లో ఉద్యోగాల కోత (layoffs) కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ గ్లోబల్ కన్సల్టింగ్ దిగ్గజం మెకెన్సీ (McKinsey) 2000 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. తమ క్లయింట్స్ తో నేరుగా సంబంధాలు ఉండని సహాయక సిబ్బందిని తొలగించే యోచనలో మెకెన్సీ ఉందని వార్తలు వస్తున్నాయి.
అధికారులు వాస్తవ పరిస్థితిని తెలపడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ప్రకటించింది. కాగా రెండు రోజుల వ్యవధిలో ఎయిర్ ఇండియాకు చెందిన రెండు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఆ విమానం కూడా అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగా..వాటి పేరెంట్స్ అడ్డుగా నిలిచి చిరుతపై పోరాడి పిల్లలను కాపాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
టర్కీలో మరోసారి భారీ భూకంపం వచ్చింది. రెక్టర్ స్కేల్ పైన 6.4 గా నమోదు అయ్యింది. పక్షం రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం కారణంగా వేలాది మంది మృతి చెందారు. లక్షల సంఖ్యలో నిరాశ్రులయ్యారు. ఇప్పటికే సహాయక చర్యలు పూర్తి కాలేదు. ఇలాంటి సమయంలో మరోమారు భూకంపం ఆందోళన కలిగించింది.
పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో ఓ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా, మరో 60 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో చోటుచేసుకుంది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 25,000 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ... సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ రికార్డులను అధిగమించాడు.
పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో ద్రవ్యోల్బణం(inflation) క్రమంగా పెరుగుతోంది. దీంతో నిత్యావసరాల ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో చికెన్ 700 రూపాయలు దాటగా, లీటర్ పాలు రూ.200కు చేరాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ ఇప్పటికే దివాళా తీసిందని దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ఖర్చులను తగ్గించుకునేందుకు రెండు గోల్ఫ్ క్లబ్‌లను విక్రయించనున్నట్లు చెప్పారు.
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకూ చాలా మంది ప్రాణాలు విడిచారు. నేటితో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
ఎక్కువగా అబ్బాయిలు తమకు ప్రేమించడానికి సరైన అమ్మాయి దొరకడం లేదని ఆవేదన చెందిన సంఘటనలు విన్నాం. కానీ అమ్మాయిలు ఎప్పుడైనా బాయ్ ఫ్రెండ్ లేడని ఏడ్చిన సంఘటనలు విన్నారా? లేదా అయితే ఇక్కడ మాత్రం అదే జరిగింది. ఈ సంఘటన చైనా షాంఘైలో జరిగింది.
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Earthquake) వల్ల మరణ మృదంగం ఇంకా కొనసాగుతోంది. తాజాగా సమాచారం ప్రకారం ఈ రెండు దేశాల్లో ఇప్పటి వరకూ 45 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Five terrorists neutralise:పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రమూకలు కరాచీలో (karachi) గల పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి నిన్న సాయంత్రం చొరబడి, కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు (terrorist) మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది (9 died) చనిపోయారు.