»Five Terrorists Neutralised 4 Including 2 Police Personnel Killed In Karachi Pc Office
Five terrorists neutralise:కరాచీ పీసీ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదుల హతం
Five terrorists neutralise:పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రమూకలు కరాచీలో (karachi) గల పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి నిన్న సాయంత్రం చొరబడి, కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు (terrorist) మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది (9 died) చనిపోయారు.
Five terrorists neutralise:పాకిస్థాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. తెహ్రీక్-ఇ-తాలిబాన్ ఉగ్రమూకలు కరాచీలో (karachi) గల పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి నిన్న సాయంత్రం చొరబడి, కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. భద్రతా దళాలు, ఉగ్రవాదులకు (terrorist) మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు సహా 9 మంది (9 died) చనిపోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లు (constables), ఓ పౌరుడు (civilian), రేంజర్ (ranger) సిబ్బంది ఉన్నారు. 17 మంది గాయపడ్డారు.
కరాచీలో గల షరియా ఫైసల్ ప్రాంతంలో పోలీస్ చీఫ్ (police chief office) కార్యాలయం ఉంది. నిన్న రాత్రి 8 మంది ఉగ్రవాదులు చొరబడ్డారని డాన్ (dawn) రిపోర్ట్ చేసింది. ఉగ్రవాదులు రెండు కార్లలో పోలీస్ చీఫ్ కార్యాలయానికి వచ్చారట. కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోగా, మరో ఇద్దరు తమను తాము పేల్చేసుకున్నారని అధికార వర్గాలు తెలిపాయి. దీంతో భవనంలో కొంతభాగం దెబ్బతింది. శక్తిమంతమైన పేలుడు కారణంగా సమీప భవనాల కిటికీ అద్దాలు ఎగిరి పడ్డాయి. పోలీసు భవనం భద్రతా దళాల నియంత్రణలో ఉంది. ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు హతమార్చారని సింధ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి ముర్తాజా వాహబ్ తెలిపారు.
ఉగ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్లు (hand granades), ఆటోమెటిక్ గన్స్ (automatic guns) ఉపయోగించినట్టు అక్కడి మీడియా చెబుతోంది. ఉగ్రవాదులు రెండు కార్లలో సాయంత్రం 7.10 గంటలకు వచ్చారని డీఐజీ ఇర్ఫాన్ బలోచ్ తెలిపారు. ఉగ్రవాదులు చొరబడిన తర్వాత కరాచీ పోలీసులు, పాకిస్థాన్ రేంజర్లు ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించారు. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ చీఫ్ కార్యాలయంలో కాల్పుల ఘటనను సింధు ముఖ్యమంత్రి మురాద్ అలీ షా తీవ్రంగా ఖండించారు.
దాదాపు నాలుగుగంటల (4 hours) పాటు ఉగ్రవాదులు- భద్రతా దళాల మధ్య భీకర ఫైరింగ్ జరిగింది. ఐదుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టడంతో ఆపరేషన్ ముగిసిందని.. భవనం స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. భవనంలోకి చొరబడ్డ ఉగ్రవాదుల సంఖ్యపై భిన్న వాదనలు ఉన్నాయి. నిన్న 8 మంది (8 members) అని చెప్పారు. ఐదుగురు (five) మాత్రమే చనిపోయారు. దీంతో మరో ముగ్గురు ఏమయ్యారనే సందేహాం వస్తోంది. ఆపరేషన్ పూర్తయ్యిందని.. కూంబింగ్ కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. చనిపోయిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.