»Porcupine Attack By Leopard At Kruger National Park South Africa
Viral Video: చిరుతను ఎదిరించి పిల్లలను రక్షించుకున్న పోర్కుపైన్లు
సాధారణంగా పిల్లలను కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఏం చేసేందుకైనా సిద్ధపడతారు. అది మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా అంతకు మించి ఉందని నిరూపించాయి. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. పోర్కుపైన్ జాతికి చెందిన పిల్లలను ఓ చిరుత వేటాడేందుకు రాగా..వాటి పేరెంట్స్ అడ్డుగా నిలిచి చిరుతపై పోరాడి పిల్లలను కాపాడుకున్నాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులు(parents) తమ పిల్లలను రక్షించుకోవడానికి ఏదైనా చేస్తారని తరచుగా చెబుతుంటారు. పలు సందర్భాలల్లో అనేక సంఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే అది మనుషుల్లోనే(humans) కాదు జంతువుల్లో(animals) కూడా ఉందని ఈ వీడియో చూస్తే అనిపిస్తుంది. ఓ చిరుతపులి(leopard) పోర్కుపైన్ చిన్న పిల్లలను వేటాడేందుకు(attack) రాగా..వాటిని రక్షించుకునేందుకు రెండు పందికొక్కు(Porcupine)లు చిరుతను ఎదిరించిన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.
వీడియోలో చిరుత అనేక విధాలుగా ఆ పిల్లలను వేటాడాలని చూసినా కూడా.. అవకాశం ఇవ్వకుండా పోర్కుపైన్లు(porcupines) వాటిని కాపాడుకున్నాయి. చిరుత దాడి(attack) చేసిన ప్రతిసారీ, పందికొక్కులు తమ వీపును తిప్పి, తమ క్విల్లను పైకి లేపి తమ పిల్లలను రక్షించుకున్నాయి. ఆ క్రమంలో చిరుతపులి(leopard) పోయే వరకు అవి అలాగే పోరాడాయి. ఈ సంఘటన దక్షిణాఫ్రికా(south africa)లోని క్రుగర్ నేషనల్ పార్క్(kruger national park)లో ఇటీవల చోటుచేసుకుంది. ఆ క్రమంలో చోటుచేసుకున్న దృశ్యాలను అటుగా వచ్చిన ఓ వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో(youtube) పోస్ట్ చేయగా..కొన్ని రోజుల్లోనే ఈ వీడియో 6.1 మిలియన్లకు పైగా వ్యూస్ ను సాధించింది.
అంతేకాదు ఈ వీడియో చూసిన పలువురు సూపర్ అంటున్నారు. అంతేకాదు ఈ వీడియోను లైక్ చేస్తూ షేర్స్ కూడా చేస్తున్నారు. జంతువుల సంకల్పం, ధైర్యం తనను ఆశ్చర్యపరిచిందని ఓ వ్యక్తి కామెంట్(comment) చేయగా..మరోవ్యక్తి గొప్ప టీమ్‌వర్క్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేశారు. వారు తమ బిడ్డలను రక్షించడంలో అద్భుతమైన పని చేశారని మరొకరు వ్యాఖ్యానించారు. గ్రేట్ జాబ్ అమ్మా నాన్న అంటూ ఇంకొకరు తెలిపారు. తల్లిదండ్రులు తమ డిఫెన్సివ్ పొజిషనింగ్‌లో మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారని మరొకరు పేర్కొన్నారు. సాధారణంగా పోర్కుపైన్లు(porcupines) పదునైన వెన్నుముకలతో లేదా క్విల్స్తో కూడి ఉంటాయి. క్విల్స్ అనేవి వాటిని వేటాడకుండా కాపాడతాయి. ఇవి ఎక్కువగా ఇటలీ, ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ఉత్తర దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి.