»The Death Toll From The Earthquake Exceeded 46000
Earthquake: 46 వేలు దాటిన మృతులు..నేటితో ముగియనున్న సహాయక చర్యలు
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకూ చాలా మంది ప్రాణాలు విడిచారు. నేటితో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది.
టర్కీ(Turkey), సిరియా(Syria) దేశాల్లో భారీ భూకంపం(Huge Earthquake) సంభవించిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో ఇప్పటి వరకూ చాలా మంది ప్రాణాలు విడిచారు. నేటితో భూకంప మృతుల సంఖ్య 46 వేలు దాటినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. భారీ భూకంపం(Huge Earthquake) ధాటికీ భవనాలన్నీ కుప్పకూలిపోయాయి. భారీ భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. దీంతో శిథిలాల కింద వేలాది మంది మరణించారు. శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ పెద్ద సంఖ్యలో మృతదేహాలు బయటపడుతున్నాయి.
శిథిలాలను తొలగిస్తుండగా కూలిన భవనం:
https://twitter.com/i/status/1627151217112776704
భారీ భూకంపం(Huge Earthquake) వల్ల ఇప్పటి వరకూ టర్కీలో 40,402 మంది మృతిచెందారు. అలాగే సిరియాలో 5800 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించి 12 రోజులు అవుతుండటంతో టర్కీ(Turkey)లో సహాయక చర్యలను నేటితో ముగించే అవకాశం ఉంది. భారీ భూకంప ప్రమాదం జరిగి 296 గంటలు పూర్తయ్యింది. దీంతో శిథిలాల కింద చిక్కుకున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు కనిపించడం లేదని అధికారులు తెలిపారు. డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ హెడ్ అయిన యూనస్ సెజర్ ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు.
సిరియాలో ప్రస్తుత పరిస్థితి :
This massive destruction was caused not by the #earthquake that rocked #Syria, but by years of #Assad and #Putin bombing #Aleppo. Today, Assad is using the horrific seismic catastrophe to wipe up these atrocities, and the #UN is backing him up. pic.twitter.com/8YGMk1SnT8
సిరియా(Syria)లో సహాయక చర్యలను ఆదివారం రాత్రి ముగించే అవకాశం ఉన్నట్లు యూనస్ సెజర్ వెల్లడించారు. భూపంకం(Earthquake) వల్ల 11 ప్రావిన్సుల్లో భారీ నష్టం వాటిల్లింది. అందులో ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో ఇప్పటి వరకూ కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని తెలిపారు. భూకంపం(Earthquake) వల్ల రెండు దేశాల భూభాగాల్లో వేల సంఖ్యల్లో భవనాలు కుప్పకూలాయి. టర్కీలో 84,726 భవనాలు ధ్వంసమైనట్లు ఆ దేశ పర్యావరణ, పట్టణ ప్రణాళిక మంత్రి మూరత్ కురుమ్ వెల్లడించారు. మార్చిలో కొత్త భవనాలను నిర్మించనున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు ఎర్డగోన్ వెల్లడించారు. గాయాలపాలైన వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.