»Love Couple Sets Guinness World Record On Longest Underwater Kiss
Lover’s Day నీటిలో రెచ్చిపోయిన జంట.. ఏకంగా 4 గంటల పాటు
ఇలాంటి విన్యాసాలు, సాహసాలు చాలా నమోదయ్యాయి. కాకపోతే జంటలు తమ వ్యక్తిగత ప్రైవసీ నేపథ్యంలో వీటిని బహిర్గతం చేయలేదు. కాగా భూతల స్వర్గంగా మాల్దీవులు దీవులు పేరు గాంచాయి. సుందరమైన ప్రదేశాలు, నీటి అందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున మాల్దీవులకు వెళ్తున్నారు. మన దేశానికి చెందిన సినీ నటీనటులు, ప్రముఖులు అక్కడకి వెళ్లి సేద తీరి వస్తున్నారు.
ప్రేమికుల దినోత్సవం (Lover’s Day) నాడు తమ ప్రేమను తెలియచెప్పేందుకు జంటలు వినూత్న రీతిలో ప్రయత్నాలు చేస్తారు. ఇక తమ ప్రేమను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు. తమ ప్రేమ ఎంత బలమైందో సమాజానికి చెప్పాలని చూస్తారు. అలాంటి కోవలోకే చెందుతుంది ఈ జంట. నీటి అడుగు భాగంలో రెచ్చిపోయారు. కొన్ని నిమిషాల పాటు ఉండి గిన్నీస్ రికార్డు (Guinness World Records) నెలకొల్పారు. రికార్డు నీటిలో ఉన్నందుకు కాదు. సుదీర్ఘ సమయం పాటు లిప్ కిస్ పెట్టుకున్న జంటగా వాళ్లు రికార్డు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
దక్షిణాఫ్రికాకు (South Africa) చెందిన బెత్ నీల్ (Beth Neale), కెనడా (Canada)కు చెందిన మైల్స్ క్లౌటియర్ (Miles Cloutier) ప్రేమికులు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమలోకంలో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. తమ ప్రేమ బంధాన్ని మరింత పెంచుకునేందుకు వాలంటైన్స్ డే ఒక అవకాశంగా లభించింది. ప్రేమికుల రోజును విభిన్నంగా.. అందరికీ గుర్తుండేలా ఉండాలని అనుకున్నారు. అనుకున్నదే ఆలస్యం సుందరమైన దీవులు మాల్దీవులకు వెళ్లారు. నీటి అడుగున ఎక్కువ సేపు ముద్దు (Lip Kiss) పెట్టుకుని గిన్నీస్ రికార్డు సృష్టించాలని భావించారు. అత్యధిక సమయం పాటు నీటిలో ఉండడంపై వీళ్లు కొన్ని వారాలు సాధన (Trained) చేశారు. పూర్తి తర్ఫీదు పొందిన అనంతరం ఫిబ్రవరి 14వ తేదీన వీళ్లిదరూ మాల్దీవ్స్ (Maldives)లో నీటి అడుగు భాగంలోకి వెళ్లారు. మోకాళ్లపై కూర్చొని ఏకంగా 4 నిమిషాల 6 సెకన్ల పాటు లిప్ కిస్ పెట్టుకున్నారు. అంత సమయం పాటు ముద్దు పెట్టుకున్న జంటగా రికార్డు సృష్టించారు. ఈ రికార్డు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైంది.
అయితే వీరిలాగ గతంలో ఇటలీ (Italy)కి చెందిన జంట ప్రయత్నించింది. కాకపోతే ఆ జంట 3 నిమిషాల 24 సెకన్ల పాటు నీటి అడుగున ముద్దు పెట్టుకున్నారు. కాకపోతే ఆ రికార్డు 13 ఏళ్ల కిందట నమోదైంది. దశాబ్ద కాలం తర్వాత వారి రికార్డును బెత్ నీల్, మైల్స్ క్లౌటియర్ బద్దలు కొట్టారు. వీరి రికార్డు వీడియోను గిన్నీస్ బుక్ రికార్డ్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ‘ఈ ప్రేమ పక్షులు నీటి గర్భంలో ముద్దుల రికార్డులను సృష్టించారు’ అంటూ ఆ జంట ముద్దు పెట్టుకునే వీడియోను ట్విటర్ లో పంచుకున్నారు. అయితే గిన్నీస్ రికార్డ్స్ బుక్ లో తమ పేరు నమోదు కావడంపై ఆ ప్రేమ జంట బెత్ నీల్, మౌల్స్ క్లౌటియర్ సంతోషం వ్యక్తం చేసింది. తాము గిన్నీస్ రికార్డు సాధిస్తామని అస్సలు అనుకోలేదని ఆ జంట తెలిపింది. అయితే ఇలాంటి విన్యాసాలు, సాహసాలు చాలా నమోదయ్యాయి. కాకపోతే జంటలు తమ వ్యక్తిగత ప్రైవసీ నేపథ్యంలో వీటిని బహిర్గతం చేయలేదు. కాగా భూతల స్వర్గంగా మాల్దీవులు దీవులు పేరు గాంచాయి. సుందరమైన ప్రదేశాలు, నీటి అందాలు తిలకించేందుకు పెద్ద ఎత్తున మాల్దీవులకు వెళ్తున్నారు. మన దేశానికి చెందిన సినీ నటీనటులు, ప్రముఖులు అక్కడకి వెళ్లి సేద తీరి వస్తున్నారు.