»Anchor Anasuya Upset With Netizens Comments On Valentines Day
Valentine’s Day రోజు యాంకర్ అనసూయ రచ్చ.. చెప్పుతో కొడతా
అనసూయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఒక్కోసారి కేసులు నమోదు చేసే దాకా వెళ్లింది. ఒక పోస్టు చేస్తే చిత్ర విచిత్ర కామెంట్లు వస్తాయి. అన్నిటిని తట్టుకుని వెళ్తేనే మంచిది. కాదు కూడదు అని దిగితే నెటిజన్ల ముందు తేలిపోతాము. ఇది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అయినా కామెంట్లు చేసే ముందు ఆలోచించుకోవాలి. మనకు అలాంటి కామెంట్లు వస్తే ఎలా? అనేది ఆలోచిస్తే ఇలాంటి వివాదాలు అస్సలే ఉండవు.
ఫిబ్రవరి 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల రోజుగా చేసుకుంటుండగా.. ఒక్క భారతదేశంలోనే ఆ రోజుపై వివాదం ఉంటుంది. ఎలాగైతే ఏమిటో ఆ రోజు ప్రశాంతంగా ముగిసిపోయింది. వాలంటైన్స్ డేను యువత ఉత్సాహంగా చేసుకుంది. ప్రేమికులు (Lovers) తమ వారిపై ఉన్న ప్రేమను వినూత్న రీతిలో తెలిపారు. ఇక వాలంటైన్స్ డే (Valentine’s Day) రోజు సోషల్ మీడియా మెసేజ్ లు, ఫొటోలతో నిండిపోయింది. ఈ క్రమంలోనే యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) కూడా వాలంటైన్స్ పై స్పందించింది. తన భర్త విషయమై పంచుకుంటూ భర్తతో కలిసి ఉన్న తన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ పోస్టుపై కొందరు నెటిజన్లు (Netizens) మెచ్చుకోగా.. మరికొందరు దూషిస్తూ కామెంట్లు చేశారు. ఓ వ్యక్తి చేసిన కామెంట్ కు అనసయూకు చిర్రెత్తుకొచ్చింది. సుదీర్ఘంగా సందేశం రాసుకుంటూ వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘నీతో జీవితం చాలా క్రేజీగా ఉంటుంది’ అంటూ భర్తతో దిగిన ఫొటోను జత చేస్తూ ఇన్ స్టాగ్రామ్ (Instagram)లో అనసూయ పోస్టు చేసింది. దీనికి ఓ నెటిజన్ స్పందిస్తూ..
నెటిజన్: ‘అదేం లేదు అక్క.. వాడి దగ్గర డబ్బు చాలా ఉంది. అందుకే’ అని కామెంట్ చేయడంతో అనసూయ తీవ్ర అసహనానికి గురైంది. వెంటనే ఆమె అతడికి బదులిచ్చింది. అనసూయ: ‘అదేంట్రా తమ్ముడు అలా అనేశావు. ఎంత ఉందేంటి డబ్బు? చెప్పు.. నాకు లేదా డబ్బు మరి? నీకు అన్ని తెలుసు కదా.. అయినా ఆయన డబ్బు, నా డబ్బు అనేది కూడా ఉందా? రేయ్ చెప్పరా బాబూ.. అయినా బావగారిని వాడు వీడు అనొచ్చా? ఇదే పెంపకం రా నీది. చెంలేసుకో. లేకపోతే నేను వేస్తా చెప్పులతో.. సారీ అదే చెంపలేస్తానంటున్నా’ అంటూ అనసూయ రిప్లయ్ ఇచ్చింది. నెటిజన్: ‘మిమ్మల్ని మీరు సమర్ధించుకోకండి. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీరు ఎన్ని చెప్పినా నిజం నిజమే’ అని నెటిజన్ రిప్లయ్ ఇచ్చాడు. అనసూయ: ‘నీ బొంద రా నీ బొంద. ముందు మాట్లాడడం నేర్చుకో. అంతర్యామిలా అన్నీ తెలిసినట్లు బిల్డప్ ఒకటి. నా రియాలిటీ నీకేం తెలుసు రా. పచ్చ కామెర్లు ఉన్నవాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందంట. నీ బుద్ధి డబ్బు ఒకటే కాబట్టి అందరికీ అదే అనిపిస్తుంది. వీలైతే నీ బుద్ధి మార్చుకో. గెట్ వెల్ సూన్. తమ్ముడివి కదా మంచీచెడు చెప్తున్నా.. ఏమనుకోకయ్యా. పాపం వచ్చీరాని భాషలో ఏదో చెప్పాలని తాపత్రయ పడుతున్నావు. పోయి పక్కకు ఆడుకో రా తమ్ముడు. మంచిగా చదువుకుని రా మల్ల మాట్లాడుదాం అప్పుడు. సరేనా జాగ్రత్త’ అంటూ అనసూయ హితవు పలికింది. నెటిజన్: ‘నేను చెప్పేది వినండి. నాకు సలహాలు ఇవ్వడం మానేయండి. మీ సలహాలు నాకు అక్కర్లేదు. నా జీవితం విషయంలో అవసరమైతే మిమ్మల్ని సంప్రదిస్తా. తమ్ముడు అని పిలవకండి’ అని రిప్లయ్ ఇచ్చాడు.
ఇక వీరిద్దరి కామెంట్లను నెటిజన్లు అమిత ఆసక్తిగా గమనించారు. వాలంటైన్స్ డే నాడు నెటిజన్ కామెంట్ తో అనసూయ అసహనానికి గురైంది. వెంటనే కామెంట్లు మానేసింది. అయితే అనసూయకు ఇలాంటి వివాదాలు కొత్త కాదు. ఒక్కోసారి కేసులు నమోదు చేసే దాకా వెళ్లింది. ఒక పోస్టు చేస్తే చిత్ర విచిత్ర కామెంట్లు వస్తాయి. అన్నిటిని తట్టుకుని వెళ్తేనే మంచిది. కాదు కూడదు అని దిగితే నెటిజన్ల ముందు తేలిపోతాము. ఇది అందరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. అయినా కామెంట్లు చేసే ముందు ఆలోచించుకోవాలి. మనకు అలాంటి కామెంట్లు వస్తే ఎలా? అనేది ఆలోచిస్తే ఇలాంటి వివాదాలు అస్సలే ఉండవు.