»Israel Is Burying Hamas Operatives By Filling Tunnels With Water
Israel: సొరంగాల్లో నీళ్లు నింపి హమాస్ దళలాను జలసమాధి చేస్తున్న ఇజ్రాయెల్
హమాస్ తీవ్రవాదులను జలసమాధి చేసేందుకు ఇజ్రాయెల్ ఓ హ్యూహాన్ని రచించింది. గాజా టన్నెల్లో సముద్రపు నీళ్లు నింపాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్లాన్ చేశాయి. సొరంగంలో మొత్తం నీటిని నిండడానికి వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తుంది. దీంతో ఉగ్రవాదులు బయటకు రావడమో, అక్కడే సమాధి కావడమో జరుగుతుందని అమెరికా వర్గాలు తెలిపాయి.
Israel is burying Hamas operatives by filling tunnels with water
Israel: గాజా(Gaza) సొరంగాల్లో(tunnels) నక్కి దాడి చేస్తున్న హమాస్ ఉగ్రవాదుల(Hamas terrorists)ను అంతం చేసేందుకు ఇజ్రాయెల్(Israel) ఓ హ్యూహాన్ని రచించింది. తీవ్రవాదులు ఉన్న టన్నెళ్లో నీళ్లు నింపి వారిని జలసమాధి చేసేలా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్లాన్ చేశాయి. ఇప్పటికే ఈ పని మొదలు పెట్టినట్లు అమెరికా వర్గాలు వెల్లడించాయి. గాజా మెట్రోగా పిలిచే హమాస్ సొరంగాల్లో సముద్రపు నీటిని విడుదల చేస్తున్నారు. సొరంగం మొత్తం నీటితో నిండడానికి వారం రోజుల సమయం పడుతుందని తెలుస్తుంది. దీని ద్వారా హమాస్ దళాలు బయటకు వస్తారని భావిస్తున్నారు. అలాగే టన్నెల్లో ఉన్న బందీలు కూడా బయటకు తీసుకురాక తప్పదు. వారి ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసం అవనున్నాయి. కాకపోతే సముద్రపు నీరు వలన గాజాలో మంచినీటి వనరులు దెబ్బతింటాయనే అందోళన ఉంది.
ఇజ్రాయెల్, హమాస్ దళాలకు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉగ్రవాదులు ఆ సొరంగాల్లోనే ఉంటున్నారు. దాంతో ఆ టన్నెల్స్‌ను దెబ్బతీయాలని ఇజ్రాయెల్ చూసింది. దీనికోసం బాంబులతో దాన్ని ధ్వంసం చేయాలని, రసాయన ద్రవాలతో దాన్ని నింపాలని, శునకాలను, రోబోలను ఇలా అనేక ఉపాయాలను ఆలోచించారు. కానీ వాటి ద్వారా నష్టాలు ఎక్కువ అని, సొరంగాలను నీటితో నింపడం మంచి వ్యూహం అని భావించారు. 2015లో గాజాపట్టీ-సినాయ్ ద్వీపకల్పం మధ్య సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఈజిప్ట్ సైన్యం నీటిని నింపి విజయం సాధించింది. గాజా సరిహద్దుల్లోని సుమారు 14 కిలోమీటర్ల మేర నీటిని నింపారు. తర్వాత ఆ నీటిని చేపల పెంపకానికి వాడారు. దీని వలన పాలస్తీన వాసులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు అదే పద్దతిలో హమాస్ దళాలను బయటకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.