»Joe Biden Will Not Come To Bharat Republic Day Celebrations 2024
Joe biden: గణతంత్ర వేడుకలకు బైడెన్ రావడం లేదా?
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) వచ్చే ఏడాది భారత్‌లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా రావడం లేదని తెలిసింది. పలు కారణాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
joe biden will not come to bharat republic day celebrations 2024
వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకల కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(joe biden) భారత్‌కు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో అధ్యక్షుడు జోబైడెన్ స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 26న వేడుకలకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను గతంలో ఆహ్వానించారు. ఈ క్రమంలోనే క్వాడ్ సమ్మిట్ తదుపరి ఎడిషన్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది. క్వాడ్ అనేది అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో కూడిన కూటమి. ఇది ఉమ్మడి దేశాల రక్షణకు సంబంధించినది.
తదుపరి క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని ప్రధాని మోదీ(modi) మేలో ప్రకటించారు. బైడెన్ న్యూఢిల్లీ నుంచి ఆహ్వానాన్ని అంగీకరించినట్లయితే, సమావేశం జనవరి 27 నాటికి జరుగుతుందని భావించారు. కానీ ఈ సమావేశానికి అన్ని దేశాలు వచ్చే అవకాశం లేదనే క్రమంలో డిసెంబర్లోనే నిర్వహించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్, అమెరికాలో రాబోయే సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. భారతదేశంలో ఏప్రిల్, మే 2024 మధ్య లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అదే సమయంలో US అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 2024 ప్రారంభంలో జరుగుతాయి. ఈ క్రమంలో మార్చి తర్వాత ఒక శిఖరాగ్ర సమావేశానికి భారత్, యునైటెడ్ స్టేట్స్కు అసౌకర్యంగా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇలాంటి క్రమంలో క్వాడ్ భేటీ ఎప్పుడు జరుగుతుంది. అమెరికా అధ్యక్షుడు వస్తాడా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.