»Indonesia Elections Why Cigarette And Coffee Sales Spike
Indonesia Elections 2024: ఈ దేశంలో ఎన్నికలకు ముందు సిగరెట్లకు భారీగా పెరిగిన డిమాండ్
ఇండోనేషియాలో ఎన్నికల సందర్భంగా ఓ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సిగరెట్లకు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ జరగనుంది.
Indonesia Elections 2024: ఇండోనేషియాలో ఎన్నికల సందర్భంగా ఓ అపూర్వ ఘటన చోటుచేసుకుంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ సిగరెట్లకు, కాఫీలకు డిమాండ్ పెరుగుతోంది. ఫిబ్రవరి 14న దేశంలో ఓటింగ్ జరగనుంది. ఈ సమయంలో ఇండోనేషియా సిగరెట్ ఉత్పత్తిదారులకు క్షణం కూడా తీరిక దొరకడం లేదు. దేశంలో సిగరెట్లకు డిమాండ్ బాగా పెరిగిపోవడంతో కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికలకు ముందు ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలో ప్రతిసారీ విజృంభిస్తుంది. దీని వెనుక కారణం ఏమిటో తెలుసుకుందాం.
బ్యాంక్ ఇండోనేషియా గవర్నర్ పెర్రీ వార్జియో డిసెంబర్ 21న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతాయని అన్నారు. గవర్నర్ ఈ ప్రకటనపై ఆర్థికవేత్త ఒకరు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో సాధారణంగా అనేక వస్తువులకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు.
డిమాండ్ ఎందుకు పెరుగుతుంది?
డిమాండ్ పెరుగుదల గురించి.. వాణిజ్య పరిశ్రమ చీఫ్ ఆదిక్ ద్వి పుత్రంతో మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రచారం సమయంలో సిగరెట్ వంటి వస్తువులకు డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే సాధారణంగా ఎన్నికల సమయంలో చాలా సమావేశాలు ఉంటాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు అందులో గుమిగూడుతారు. ఎన్నికలలో అభ్యర్థులు తమ ఎజెండాను ప్రజలకు తెలియజేసేందుకు పెద్దపెద్ద సమావేశాలు నిర్వహిస్తారని ఆదిక్ ద్వి పుత్రంతో అన్నారు. సాధారణంగా ఇలాంటి సమావేశాల్లో నాయకులు ప్రజలకు సిగరెట్లు, కాఫీలు అందిస్తారు. ఇండోనేషియాలో కాఫీతో పాటు సిగరెట్లను ఎక్కువగా తాగుతారని అతను చెప్పాడు. ఇండోనేషియా కస్టమ్ అండ్ ఎక్సైజ్ ఏజెన్సీ ప్రకారం.. 2019 ఎన్నికల సీజన్లో సిగరెట్ ఉత్పత్తి నెలవారీ 24.36 నుండి సుమారు 29.6 బిలియన్ స్టిక్లకు పెరిగింది.
ఫిబ్రవరి 14న ఓట్లు
ప్రపంచవ్యాప్తంగా యువత ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోనుండగా, ముస్లిం మెజారిటీ దేశమైన ఇండోనేషియాలో సగం కంటే ఎక్కువ మంది యువ ఓటర్లు తమ తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఓటు వేస్తారు. ఇండోనేషియాలో 50 శాతానికి పైగా యువత ఓటర్లు ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో తన గరిష్ట పరిమితి రెండు సార్లు తన పదవీకాలాన్ని పూర్తి చేశారు. ఈ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులు ప్రబోవో సుబియాంటో, గంజర్ ప్రణోవో, అనీస్ బస్వేదన్ అధ్యక్షుడిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.