»If You Dont Win Me As The President Of America It Will Be Bloody Donald Trump
Donald Trump: ఎన్నికల్లో గెలవకపోతే రక్తపాతమే.. డోనల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడిగా డోనల్డ్ ట్రంప్‌ను గెలిపించకపోతే దేశంలో రక్తపాతం జరుగుతుందని వివాదస్పదవ్యాఖ్యలు చేశారు. చైనా కుట్రను తిప్పికొడుతా అని అన్నారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు చరిత్రలో నిలిచిపోతాయి అన్నారు.
Donald Trump: డోనల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధక్షుడి రేసులో ఉన్న తాను ప్రచారంలో భాగంగా మాట్లాడారు. ప్రెసిడెంట్‌గా తనను గెలిపించకపోతే దేశంలో రక్తపాతం జరుగుతుందని అన్నారు. ఆయన మాటలు విన్న ప్రజలు ఒక్క సారిగా అవాక్కయ్యారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మాటలకు తమ పార్టీ నేతలు సమాధానం ఇచ్చారు. నవంబర్ 5 అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని, ఆ రోజు దేశ చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఒహియోలోని వాండాలియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. దీంతో మళ్లీ జో బైడన్ గెలిస్తే అర్థిక రక్తపాతం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఆ మాటలు అన్నారని తన టీమ్ మీడియాకు వెల్లడించింది. మెక్సికోలో కార్లను తయారు చేయడానికి చైనా దేశం ప్రయత్నం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. తాను అధ్యక్షుడు అయితే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నారు. ఆ కార్లపై 100 శాతం సుంకం విధిస్తా అని వెల్లడించారు. జో బైడెన్(Joe Biden)ను ఓ చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించారు. వలసదారులకు మిలియన్ల కొద్ది వర్క్ పర్మిట్లు మంజూరు చేశారు. దాని ద్వారా ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లకు వెన్నుపోటుపొడిచారని విమర్శించారు.