»Australian Man Turns A Ferris Wheel With Bare Hands Sets World Record
Ferris Wheel with Bare Hands: చేతులతో ‘ఫెర్రిస్ వీల్’ తిప్పి గిన్నిస్ రికార్డ్ సాధించాడు
వట్టి చేతులతో ఎండ్ల బండి చక్రాన్ని తిప్పడమే చాలా మందికి కష్టం. అలాంటిది ఓ ఆస్ట్రేలియన్ ఫెర్రిస్ వీల్‌ను అతి తక్కువ సమయంలో చేతితో తిప్పి గిన్నిస్ రికార్డ్స్ సాధించాడు.
Ferris Wheel with Bare Hands: ట్రాయ్ కాన్లీ-మాగ్నస్సన్ అనే ఆస్ట్రేలియన్ వ్యక్తి ఫెర్రిస్ వీల్‌ను తక్కువ సమయంలో చేతితో తిప్పి (Ferris wheel with bare hands) ప్రపంచ రికార్డు సాధించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (Guinness World Records) ప్రకారం 16 నిమిషాల 55 నిమిషాల్లో చేశాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ఇన్స్టాగ్రామ్ (Instagram) ట్రాయ్ కాన్లీ-మాగ్నస్సన్ రికార్డును బద్దలు కొట్టిన వీడియోను షేర్ చేసింది.
“ట్రాయ్ కాన్లీ-మాగ్నస్సన్ 16 నిమిషాల 55 సెకన్లలో ఫెర్రిస్ వీల్‌ను చేతితో తిప్పాడు. చాలా వేగంగా తిప్పాడని” గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్రి ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు. మాగ్నస్సన్ తన చేతులతో ఫెర్రిస్ వీల్‌ను తిప్పుతున్నట్లు కనిపించే వీడియోను కూడా వారు పంచుకున్నారు. తర్వాత మాగ్నస్సన్ ఇలా రాశాడు. “ఇది నేను చేయని కష్టతరమైన ఘటన. శిక్షణ పూర్తి చేయడానికి 30 నిమిషాల సమయం ఉంది, చక్రం దాని బరువు 50 టన్నులకు పైగా ఉంటుంది, తనకు తెలుసు ఇది ఊపిరితిత్తులకు మరియు హృదయానికి ఎక్కువ ఒత్తిడిని ఇస్తుంది.” అని రాశారు.