Esha Gupta: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఇషా గుప్తా (Esha Gupta) తొలిసారి కేన్స్ వేదికపై మెరిశారు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేదికపైకి అడుగు పెట్టడం ద్వారా ఇషా గుప్తా తన కెరీర్లో మరో మైలురాయిని సాధించింది. భారత ప్రభుత్వ ప్రతినిధి బృందంలో భాగంగా ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. వెండితెరపై “జీన్నే డు బారీ” అనే ఉత్సవ ప్రారంభ చిత్రం ప్రీమియర్‌కు ఇషా గుప్తా (Esha Gupta) హాజరయ్యారు.
తెలుపు రంగు డ్రెస్సులో రాజహంసలా ఇషా గుప్తా (Esha Gupta) మెరిసిపోయారు. డ్రెస్‌కి సరిపోయే జ్యూవెలరీ ధరించారు. ఆ డ్రెస్‌లో చాలా అందంగా కనిపించారు అనే కాంప్లిమెంట్స్ ఎక్కువగా వచ్చాయి. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొనడంపై ఆమె స్పందించారు.”తన దుస్తులకు వచ్చిన స్పందన అద్భుతంగా ఉంది. ఇలా వస్తుందని ఊహించలేదు. ఉత్తమ దుస్తులు ధరించి ఉంటానని ఊహించలేదు. ఆ డ్రెస్ గురించి ప్రపంచ నలుమూలల నుంచి ప్రజలు కాల్ చేస్తున్నారు.’ అని ఇషా గుప్తా (Esha Gupta) చెప్పారు.
ఇలాంటి డ్రెస్ వేసుకోవడం చాలా పెద్ద రిస్క్ అని ఇషా గుప్తా (Esha Gupta) అంటున్నారు. నికోలస్ జెబ్రాన్ గౌను వేసుకున్నప్పుడు, అందులో తాను సెక్సీగా ఉన్నానని అనిపించిందని చెప్పారు. ఇది దేవ కన్యలా కనిపించాలనే ఉద్దేశంతో డిజైన్ చేశారని చెప్పారు. గౌను తెలుపు రంగులో ఉండగా, దాని మీద 3D పువ్వులు కలిగి ఉంటాయి. ఈ క్రెడిట్ మొత్తం తన డిజైనర్ కి ఇస్తున్నానని ఇషా గుప్తా (Esha Gupta) చెప్పారు.