Vijay Deverakonda: అనిరుధ్తో రిస్క్ చేస్తున్న విజయ్ దేవరకొండ?
అసలే ఫ్లాపుల్లో ఉన్నాడు.. అయినా కూడా రిస్క్ చేయడానికి ఏ మాత్రం తగ్గడం లేదట రౌడీ హీరో విజయ్ దేవరకొండ. అప్ కమింగ్ ఫిల్మ్ కోసం అనిరుధ్తో కలిసి ప్రయోగం చేయడానికి రెడీ అవుతున్నాడనే న్యూస్ వైరల్గా మారింది.
Vijay Deverakonda: రౌడీ హీరోకి ఒక్క సాలిడ్ హిట్ పడితే చూడాలని అభిమానులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఈసారి గట్టిగా కొడుతున్నామని.. సినిమా రిలీజ్కు ముందు ఓ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నాడు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్ల నుంచి నిరాశగా తిరిగి వస్తున్నారు రౌడీ ఫ్యాన్స్. ఖుషి పర్వాలేదనిపించినప్పటికీ.. ఫ్యామిలీ స్టార్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెక్స్ట్ ప్రాజెక్ట్ గౌతమ్ తిన్ననూరి సినిమా పై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. నెక్స్ట్ షెడ్యూల్ వైజాగ్లో జరగనుంది. అయితే.. ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్గా మారింది. ఈ సినిమాలో అసలు పాటలే ఉండవని తెలుస్తోంది. విజయ్ దేవరకొండ గూఢచారి పాత్రలో కనిపించనున్నాడట.
సినిమా మొత్తం సీరియస్ మోడ్లో ఉంటుందట. పైగా కథ పరంగా పాటలు అవసరం లేదట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. మామూలుగానే ఈ మధ్య బీజిఎంతో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు అనిరుధ్. అందుకే.. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఒక్కటి చాలు ఈ సినిమాను లేపడానికి అని గట్టిగా నమ్ముతున్నారట మేకర్స్. పాటలు పెడితే సినిమా మూడ్ దెబ్బతింటుందని భావిస్తున్నాడట డైరెక్టర్. విజయ్ దేవరకొండ కూడా గౌతమ్ చెప్పిన దానికి ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ అక్కడక్కడా బిట్ సాంగ్స్ మాత్రం ఉంటాయట. ఏదేమైనా.. పాటల్లేకుండా రౌడీ ఈసారి రిస్క్ చేస్తున్నాడనే చెప్పాలి. అది కూడా అనిరుధ్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టుకొని సాంగ్స్ వద్దంటే.. ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.