ప్రముఖ నటుడు, బీజేపీ అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అని జూనియర్ నటి షినోవా సోనీ చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో నిజం తెలుసుకోవడానికి డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆమె ఇటీవల ముంబాయి కోర్టును ఆశ్రయించగా.. కోర్టు అనుమతి ఇవ్వలేదు.
Ravi Kishan: ప్రముఖ నటుడు, బీజేపీ అభ్యర్థి రవికిషన్ తన తండ్రి అని జూనియర్ నటి షినోవా సోనీ చేసిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో నిజం తెలుసుకోవడానికి డీఎన్ఏ పరీక్ష చేయించాలని ఆమె ఇటీవల ముంబాయి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టివేసింది. రవి కిషన్ తన భర్త అని కొన్ని రోజుల కిందట షినోవా తల్లి అపర్ణా సోని లఖన్వూల్లో విలేకరుల ముందు తెలిపారు. తర్వాత డీఎన్ఏ పరీక్షల కోసం కోర్టును ఆశ్రయించారు.
రవికిషన్ తండ్రి అయినప్పటికీ నేను అంకుల్ అని పిలుస్తున్నానని ఆమె అన్నారు. రవికిషన్కి ఆమెకు ఎలాంటి సంబంధం లేదని నటుడి తరపున న్యాయవాది వాదించారు. ఇద్దరికీ ముందు నుంచే పరిచయం ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. రవికిషన్, అపర్ణల మధ్య రిలేషన్ ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కోర్టు డీఎన్ఏ పరీక్షను తిరస్కరించింది.