Karate Kalyani : ‘మా’ అసోసియేషన్ లో కరాటే కళ్యాణి సభ్యత్వం రద్దు
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు.
Karate Kalyani : ఇటీవల సీనియర్ ఎన్టీఆర్(NTR) పై సినీనటి కరాటే కళ్యాణి అనుచిత వ్యాఖ్యలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటీసులు(Notice) జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ‘ మా ‘ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) ఆదేశించారు. ఖమ్మం(Khammam)లోని లకారం ట్యాంక్ బండ్ వద్ద 54 అడుగుల శ్రీకృష్ణుని రూపంలోని ఎన్టిఆర్ విగ్రహాన్ని(NTR statue) ఏర్పాటు చేయటానికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విగ్రహావిష్కరణకుగాను జూనియర్ ఎన్టీఆర్(Jr.NTR)కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆహ్వానాన్ని కూడా అందించారు. అయితే శ్రీకృష్ణుడు(Lord Krishna) రూపంలోని ఎన్టిఆర్ విగ్రహావిష్కరణ చేయడంపై కరాటే కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె యాదవ సంఘాలు, కొన్ని హిందూ సంఘాలతో కలిసి పోరాటం చేస్తున్నారు.
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణను అడ్డుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కృష్ణుడి రూపంలో తారకరామారావు విగ్రహాన్ని పెట్టడాన్ని ఆమె తప్పుబట్టారు. ఖమ్మంలో శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టి రామారావు విగ్రహావిష్కరణను నిలిపివేయాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ మహిళా అధ్యక్షురాలుగా ఆమె డిమాండ్ చేశారు. దేవుడి రూపంలో ఉన్న రాజకీయ వ్యక్తిని ఆరాధిస్తూ తమ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తారని విమర్శించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై ‘ మా ‘ అసోసియేషన్ నుండి కరాటే కల్యాణి షోకాజ్ నోటీసులను అందుకున్నారు. ఈ వివాదంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ‘ మా ‘ అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశించారు. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తక్షణ ఆదేశాలను జారీ చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 16 న పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలోగా వివరణ ఇవ్వనందుకు, ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేసినా.. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడం ‘మా’ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై మా అసోసియేషన్ చర్చించి తక్షణమే కరాటే కళ్యాణి సస్పెండ్ చేస్తున్నట్లు ఆదేశాల్లో రాసుకొచ్చారు.