ఇస్రో (ISRO) ఛైర్మన్ ఎస్ సోమనాథ్ (S Somnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. సైన్స్ అంతా వేదం నుంచి వచ్చిందని ఆయన అన్నారు. బీజగణితం(Algebra), వర్గమూలాలు, కాల గణన, ఆర్కిటెక్చర్, మెటల్లర్జీ, విమాన శాస్త్రం మొదలైనవాటిని తొలుత వేదాల్లోనే కనుగొన్నారని సోమనాథ్ తెలిపారు. ఉజ్జయిని(Ujjain)లోని మహర్షి పాణిని సంస్కృతం, వేదిక్ విశ్వవిద్యాలయంలోని ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.వేదాలలోని సారమంతా అరబ్బు దేశాల ద్వారా యూరప్(Europe)కి వెళ్లిపోయింది. కాలక్రమంలో అవన్నీ అక్కడి శాస్త్రవేత్తలు కనుగొన్న విషయాల్లా మారిపోయాయి’ అని ఆయన అన్నారు. ‘ వేదకాలం శాస్త్రవేత్తలు (Scientists) విషయాలను లిఖించలేదు. సంస్కృత భాషలో ఒకరి నుంచి మరొకరికి వాక్కు రూపంలో మాత్రమే బదిలీ జరిగేది. అందుకే ఈ సమస్య వచ్చింది’ అన్నారు. అంతే కాకుండా కృత్రిమ మేధకు సంస్కృతం సరిగ్గా సరిపోతుందని ఆయన పేర్కొన్నారు