అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో కనుమ పండుగ సందర్భంగా గోపూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆలయ అర్చకులు శ్రీ శంకరయ్య స్వామి గోపూజ ప్రాముఖ్యతను వివరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమ వివరాలను ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ డీవీ రమణ రెడ్డి తెలిపారు.