Earthquake: ఆప్ఘనిస్తాన్‌లో భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.9గా ఉంది. ఫైజాబాద్‌కు ఆగ్నేయంగా 70 కిలోమీటర్ల దూరంలో ఈ రోజు ఉదయం 10.19 గంటలకు భూమి కంపించింది. ఈ మేరకు యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మొలాజికల్ సెంటర్ పేర్కొంది.
చదవండి: Pawan Kalyan: OG విలన్‌గా యంగ్ హీరో.. మామూలుగా ఉండదు మరి!
ఆప్ఘనిస్థాన్‌లో (Afghanistan) భూకంపం (Earthquake) రాగా.. దాని ప్రభావం చుట్టు పక్కల ప్రాంతాలపై పడింది. పాకిస్థాన్‌లోని (pakistan) కొన్ని ప్రాంతాలు, శ్రీ నగర్ (sri nagar), పూంచ్ (poonch), జమ్ము కశ్మీర్‌లోనూ (jammu kashmir) భూమి కంపించింది. ఢిల్లీ (delhi).. పరిసర ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనాలు (tremors) వచ్చాయి. భూమి కంపించడంతో జనం (people) ఒక్కసారిగా ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. ఆప్ఘనిస్థాన్‌లో వచ్చిన భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.