యంగ్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా(Mehreen Pirzada) నవంబర్ 5, 1994న పంజాబ్లోని భటిండాలో జన్మించింది. ఈ అమ్మడు 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ అనే తెలుగు చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె 2017లో ఫిల్లౌరితో హిందీలో, తమిళంలో నెంజిల్ తునివిరుంధాల్తో అరంగేట్రం చేసింది. తర్వాత మహానుభావుడు (2017), రాజా ది గ్రేట్ (2017), F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019) వంటి హిట్టు చిత్రాల్లో యాక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్పార్క్ సహా మరో మూవీ ప్రాజెక్టులో ఈ భామ నటిస్తోంది.