body odor : శరీరం కంపు కొడుతోందా? వీటిని తినడం తగ్గించండి!
కొంచెం మందికి శరీరం ఊరికే చెడు వాసన వస్తుంటుంది. వారి దగ్గర నిలబడాలంటే అవతలి వారికి ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది. అలాంటి వారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
body odor : కొంచెం మంది దగ్గర నిలబడ లేనంతగా వాసన వస్తుంటుంది. చమట సైతం దుర్గంధాన్ని వెదజల్లుతుంటుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి చాలా మంది డియోడరెంట్లు, సెంట్లను వాడుతుంటారు. అయితే ఆ రెండు వాసనలు కలిసిపోయి మరింత ఘోరంగా పరిస్థితి తయారవుతుంది. ఇలాంటి సమస్యలు ఉన్న వారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మసాలాలు, వెల్లుల్లి లాంటి వాటిని ఆహారంలో( food) అతిగా తీసుకుంటున్నట్లైతే శరీరం దుర్వాసన(body odor) వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇదే విషయాన్ని జర్నల్ ఆఫ్ బ్రీత్ రీసర్చ్ అనే జర్నల్ సైతం ప్రచురించింది. 2019లో ఈ జర్నల్‌లో అధ్యయనం ప్రచురితం అయింది. దాని ప్రకారం వెల్లుల్లి, మసాలు తినే వారికి శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దీంతో చమట అధికంగా పడుతుంది. బ్యాడ్ స్మెల్(Bad Smell) వస్తుంది. ఇదే కారణం వల్ల నోటి దుర్వాసన కూడా వచ్చే అవకాశాలూ ఉంటాయి.
శరీర దుర్వాసన అధికంగా వచ్చే వారు నాన్‌వెజ్‌కు సైతం కాస్త దూరంగా ఉండాల్సిందే. చికెన్, ఫిష్, మటన్ లాంటి వాటిని తరచుగా తినే వారికి సైతం ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మద్యం తాగే వారిలో సైతం ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దుర్వాసన రాకుండా ఉండాలంటే వీటి విషయంలో జాగ్రత్త అవసరం. ఇంకా కాలీఫ్లవర్, క్యాబేజీలు రెండూ కూడా శరీర దుర్వాసనకు కారణం అవుతాయి. ఇవి తిన్నాక జీర్ణాశయంలో జీర్ణం అవుతాయి. ఆ సమయంలో హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌ని రిలీజ్ చేస్తాయి. అది మన నోరు, శరీరం నుంచి బయటకు వస్తుంది. ఫలితంగా కూడా బాడీ స్మెల్ దారుణంగా ఉంటుంది.