Gold and Silver Rates Today : బంగారంపై పెట్టుబడి పెట్టాలని చూసుకునే వారు రోజూ దీని ధరను సైతం పరిశీలిస్తూ ఉండాల్సిందే. అప్పుడే కాస్త తగ్గినప్పుడు దీన్ని కొనుక్కోవడానికి వీలవుతుంది. మరి నేటి ధర ఎంతో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర బుధవారం రూ.75 పెరిగింది. దీంతో నేడు దీని ధర రూ.74,020కు చేరుకుంది.
హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రధాన నగరాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) దాదాపుగా ఇలాగే కొనసాగుతోంది. అయితే ఈ ధరలు మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి మత్రమే. తర్వాత మళ్లీ మారే అవకాశాలు ఉంటాయి. అలాగే వినియోగదారులు నగల్ని కొనుక్కోవడానికి దుకాణానికి వెళితే ఈ ధరలకు తోడు మజూరీ, జీఎస్టీలను సైతం చెల్లించాల్సి ఉంటుంది.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate) బుధవారం పెరిగింది. రూ.624 పెరగడంతో కిలో వెండి ధర రూ.91,140కి చేరుకుంది. హైదరాబాద్, ప్రొద్దుటూరు, విజయవాడ, విశాఖపట్నం తదితర చోట్ల సైతం వెండి ధర ఇదే కొనసాగుతోంది.
ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర సైతం స్థిరంగా ఉంది. మంగళవారం 2327 డాలర్లు ఉన్న ఔన్సు స్పాట్ గోల్డ్ బుధవారం సైతం అలాగే కొనసాగుతోంది. అలాగే ఔన్సు ఎవండి 29.64 డాలర్లుగా ఉంది.