వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సందడి మామూలుగా లేదు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా ఫ్యాన్స్‌ను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఏది చేసిన బ్యాక్ టు బ్యాక్ ప్లాన్ చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. రీసెంట్గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లతో సినిమా పై ఒక్కసారిగా భారీ హైప్ వచ్చేసింది. ఇక తాజాగా వచ్చిన వీరసింహారెడ్డి మాస్ మొగుడు సాంగ్.. నందమూరి అభిమానుల చేత విజిల్స్ వేయిస్తోంది. అందుకే ఏ మాత్రం లేట్ చేయకుండా.. నాకేమో తొందరెక్కువ అంటున్నారు మెగాస్టార్. ఇప్పటికే వాల్తేరు వీరయ్య నుంచి విడుదలైన బాస్ పార్టీ, చిరంజీవి-శ్రీదేవి, వీరయ్య, పూనకాలు లోడింగ్.. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పుడు వీరయ్య స్టైల్లో పెప్పీ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి వస్తున్న 5వ సాంగ్ రిలీజ్ టైం లాక్ చేశారు. ఇప్పటికే చిరు లీక్స్‌లో భాగంగా.. ‘నీకేమో అందం ఎక్కువ, నాకేమో తొందర ఎక్కువ’ అంటూ సాగే పాటను తీసుకురాబోతున్నట్టు చెప్పేశాడు మెగాస్టార్. ఈ సాంగ్ షూట్‌తోనే ఫ్రాన్స్‌లో వాల్తేరు వీరయ్యకు గుమ్మడికాయ కొట్టారు. ఈ సాంగ్‌ను రేపు.. అంటే జనవరి 11న, ఉదయం 10 గంటల 35 నిమిషాలకు.. హైదారాబాద్ మల్లా రెడ్డి యూనివర్సిటీలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో.. లుంగీ కట్టి.. రోజా పువ్వు చేత పట్టి.. ఫారిన్ వీధుల్లో.. హీరోయిన్ శృతి హాసన్ వెంటపడుతున్నాడు మెగాస్టార్. మరి పెప్పీ మెలోడితో దేవిశ్రీ ప్రసాద్ ఎలాంటి ట్యూన్‌తో వస్తాడో చూడాలి.