»Trivikram Teamed Up With Trivikram For Hiranyakashyap
Hiranyakashyap: కోసం త్రివిక్రమ్ తో జతకట్టిన రానా!
స్టార్ హీరో రానా దగ్గుబాటి తన నెక్ట్స్ మూవీ ప్రాజెక్టును ప్రకటించారు. రాక్షస రాజు హిరణ్యకశ్యపు పౌరాణిక కథ చేయనున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి ప్రముఖ తెలుగు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టోరీ అందించినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరో రానా(Rana) హిరణ్యకశ్యప(Hiranyakashyap) మూవీ ఎప్పుడో ప్రకటించారు. ఈ మూవీ ఆయన గుణశేఖర్ తో చేయాల్సి ఉంది. కానీ, ఇప్పుడు మొత్తం సీన్ రివర్స్ అయ్యింది. ఈ మధ్యకాలంలో గుణశేఖర్ చేస్తున్న సినిమాలు ఏవీ పెద్దగా క్లిక్ అవ్వకపోవడంతో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ స్క్రిప్ట్ పనులు త్రివిక్రమ్ చేపట్టడం విశేషం. ప్రస్తుతం ప్రాజెక్ట్ కే మూవీ టీమ్ కోసం రానా కూడా అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్లో సినిమా, వెబ్ సిరీస్ను అనౌన్స్ చేశాడు. తన ప్రొడక్షన్ బ్యానర్ స్పిరిట్ మీడియా కింద నిర్మించబోయే చిత్రాలు, సిరీస్ను అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న సాన్ డిగో కామిక్ కాన్ ఈవెంట్ సందర్భంగా ప్రకటించాడు.
హిరణ్యకశ్యప చిత్రాన్ని చేయనున్నట్టు రానా ప్రకటించాడు. తన ఎంటర్టైన్మెంట్ కంపెనీ స్పిరిట్ మీడియా కింద ఈ సినిమాను రానా(Rana) నిర్మించనున్నాడు. హిరణ్యకశ్యపుడి పాత్రను రానా పోషించనున్నాడు. అమరచిత్ర కథ కామిక్స్ కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కనుంది. మాటల మాంత్రికుడు, ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్..ఈ హిరణ్యకశ్యప చిత్రానికి స్క్రిప్ట్ రాయనున్నాడు. విష్ణువుపై భక్తుల నమ్మకాన్ని హరించేందుకు యత్నించే శక్తివంతమైన రాక్షసుడు హిరణ్యకశ్యపుడి పాత్రను రానా పోషించనున్నాడు. కాగా, ఇలా రానా ప్రకటించడంపై గుణశేఖర్ సీరియస్ అవుతుండటం విశేషం.