ప్రస్తుతం చిరు, బాలయ్య ఫ్యాన్ మాస్ జాతర చేసేందుకు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా రిలీజ్‌కు ముందే ఈవెంట్లతో హంగామా చేయబోతున్నారు. జనవరి 6న వీరసింహారెడ్డి, 8న వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతున్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి మాస్ జాతర ఒంగోలులో ఏబీఎం కాలేజీ గ్రౌండ్లో జరగనుండగా.. వాల్తేరు వీరయ్య ఈవెంట్‌ను వైజాగ్ ఆర్కే బీచ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. కానీ చివరి నిమిషంలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ రెండు ఈవెంట్స్‌కి.. ఫ్యాన్స్ భారీగా తరలిరానుండడంతో.. ట్రాఫిక్ సమస్యలు, తొక్కిసలాట లాంటివి జరగకుండా.. ఏపి పోలీసుల నుండి పర్మిషన్ రాలేదని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. దాంతో మైత్రీ వారు వెంటనే వేదికను మార్చుకోవాల్సి వచ్చింది. ఎబీఎం కాలేజ్ గ్రౌండ్స్ నుంచి త్రోవగుంట సమీపంలోని అర్జున్ ఇన్ఫ్రాలో.. వీరసంహారెడ్డి ఈవెంట్‌ను నిర్వహించుకోవటానికి అనుమతి ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడు ఈవెంట్ మేనేజర్స్ అర్జున్ ఇన్ఫ్రాను ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం సిద్ధం చేస్తున్నారు. వేదిక మారిన లొకేషన్ మారలేదు కాబట్టి.. ఒంగోలు జాతరకు సిద్ధమవుతున్నారు బాలయ్య ఫ్యాన్స్. అయితే వాల్తేరు వీరయ్య వేదిక పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘వీర సింహా రెడ్డి’లో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రల్లో నటించారు. జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వాల్తేరు వీరయ్యలోను శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి13న రిలీజ్ చేయనున్నారు.