యంగ్ బ్యూటీ శ్రీలీల.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఛాన్స్ అందుకుందనే న్యూస్, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీలీలను హీరోయిన్గా తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ముందునుంచి ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డేను హీరోయిన్గా అనుంటున్నారు. మధ్యలో పూజా కన్ఫామ్ అయిందనే టాక్ కూడా వచ్చింది. కానీ ఉన్నట్టుండి పూజా ప్లేస్‌కు శ్రీలీల ఎసరు పెట్టిందని వార్తలొచ్చాయి. ప్రస్తుతం శ్రీలీల పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ 28లోను నటిస్తోంది. ఇక నెక్స్ట్ స్టెప్‌లో భాగంగా పవర్ స్టార్‌తో దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్టే. కాకపోతే.. అమ్మడిని తీసుకుంది ఉస్తాద్ భగత్ సింగ్ కోసమా, లేదంటే ‘ఓజి’ కోసమా అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. తాజాగా శ్రీలీలను ఓజి మూవీ కోసం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇటీవలె సాహో డైరెక్టర్ సుజీత్ డైరెక్షన్లో ‘ఓజి’ ప్రాజెక్ట్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేశారు పవన్. సమ్మర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ అవలేదు. అందుకే ఇప్పుడు ఓజి కోసమే శ్రీలీలను తీసుకున్నట్టు సమాచారం. ఎలాగు ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం పూజా హెగ్డే లైన్లో ఉంది కాబట్టి.. ఓజిలోనే శ్రీలీల ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఓజిలో అసలు హీరోయినే లేదనేది.. మరో వెర్షన్. కానీ ఇప్పుడు శ్రీలీల పేరు వినిపిస్తోంది కాబట్టి.. హీరోయిన్ లేదనేది ఫేక్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఏదేమైనా ఉస్తాద్ భగత్‌సింగ్, ఓజి.. ఈ రెండు సినిమాల్లో ఏదో ఓ సినిమాలో శ్రీలీల.. పవర్ స్టార్‌తో రొమాన్స్ చేయడం మాత్రం పక్కా.