ప్రస్తుతం ప్రభాస్ చేతిలో సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, మారుతి సినిమాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో సలార్ పై ఊహకందని అంచనాలున్నాయి. ప్రభాస్ లాంటి కటౌట్‌కి ప్రశాంత్ నీల్ రేంజ్ ఎలివేషన్ పడితే.. స్క్రీన్లు చిరిగిపోతాయని.. ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 28న సలార్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు ప్రభాస్, ప్రశాంత్ నీల్. దీంతో షూటింగ్ దాదాపుగా పూర్తైపోయినట్టేనని అంటున్నారు. ఆ తర్వాత దాదాపు ఓ ఆరు నెలల పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ కోసం సమయాన్ని కేటాయించనున్నారు. అయితే ఈలోపు వస్తున్న అప్డేట్స్ ప్రభాస్ ఫ్యాన్స్‌ను మరింత టెంప్ట్ చేస్తున్నాయి. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్టేట్ ప్రకారం.. సలార్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న గెటప్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. లుక్స్ పరంగా ఇంతకు ముందెన్నడు చూడని ప్రభాస్‌ని ఇందులో చూడబోతున్నామట. ముఖ్యంగా.. సెకండ్ హాఫ్‌లో వచ్చే మాసివ్ లుక్ నెక్స్ట్ లెవల్లో ఉంటుందట. ప్రభాస్ గెటప్ అండ్ సెటప్ చాలా కొత్తగా ఉంటాయని సమచారం. ప్రభాస్ కెరీర్ బెస్ట్ లుక్‌గా సలార్ చిత్రం నిలిచిపోతుందని అంటున్నారు. అంతలా ప్రభాస్ లుక్‌ను డిజైన్ చేశాడట ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇకపోతే శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను.. హోంబలే ఫిలింస్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా.. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుందని అంటున్నారు. మరి భారీ అంచనాలున్న సలార్.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.