ఈ సంక్రాంతి వార్ ఎలా ఉంటుందో ముందుగానే హింట్ ఇస్తున్నారు వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి. గతంలో కంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడబతోతున్నారు చిరు బాలయ్య. మధ్యలో విజయ్, అజిత్ లాంటి తమిళ్ హీరోలు ఉన్నా.. చిరు, బాలయ్యదే పై చేయిగా కనిస్తోంది. అయితే జనవరిలోనే కాదు ఫిబ్రవరిలో కూడా బాక్సాఫీస్ వార్ ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్న సమంత.. ఇప్పుడు శాకుంతలంగా రాబోతోంది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శాకుంతలం’ సినిమా.. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ గత కొన్ని రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పనులు తుది దశలో ఉన్నాయి. మరి కొన్ని రోజుల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తవనున్నాయి. దాంతో తాజాగా శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ పాన్ ఇండియన్ మూవీని ఫిబ్రవరి 17 విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. అయితే ఆ రోజు సమంతకు గట్టి పోటీ తప్పేలా లేదు. ఇప్పటికే ఫిబ్రవరి 17న, బరిలోకి దిగేందుకు పలు సినిమాలు బరిలో ఉన్నాయి. ధనుష్ నటిస్తున్న ‘సార్’, యంగ్ హీరో విశ్వక్ సేన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘ధమ్కీ’, కిరణ్ అబ్బవరం నటిస్తున్న ‘వినరో భాగ్యము విష్ణు కథ’.. చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంకొన్ని హిందీ, ఇంగ్లీష్ సినిమాలు కూడా రిలీజ్కు రెడీ అవుతున్నాయి. దాంతో సమంతకు గట్టి పోటీ తప్పేలా లేదంటున్నారు. అయితే ఉన్నట్టుండి సమంత రేసులోకి రావడంతో.. యంగ్ హీరోలకు కూడా రిస్క్ తప్పదనే చెప్పాలి. మరి వీరిలో బాక్సాఫీస్ దగ్గర ఎవరు సత్తా చాటుతారో చూడాలి.