Ram Pothineni : వైరల్‌గా మారిన ‘రామ్-బోయపాటి’ లుక్!
Ram Pothineni ఇస్మార్ట్ శంకర్ నయా లుక్ అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేని పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకు ముందు ఎనర్జిటిక్ స్టార్‌ని ఇలాంటి కిర్రాక్ లుక్‌లో చూడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు.
Ram Pothineni ఇస్మార్ట్ శంకర్ నయా లుక్ అదుర్స్ అనేలా ఉంది. రామ్ పోతినేని పేరు ట్విట్టర్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకు ముందు ఎనర్జిటిక్ స్టార్‌ని ఇలాంటి కిర్రాక్ లుక్‌లో చూడలేదు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రామ్, బోయపాటికి ఇదే ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్. అఖండ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి చేస్తున్న సినిమా కావడండో.. ఎక్స్పెక్టేషన్స్ పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. మామూలుగా డ్యాన్స్ విషయంలో రామ్ అదరగొడతాడు.. ఇక శ్రీలీల డ్యాన్స్ ధమాకాలో చూశాం. అలాంటి ఈ ఇద్దరు కలిస్తే.. థియేటర్ ఊగిపోవాల్సిందే. అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రామ్ లుక్ కూడా రివీల్ చేయలేదు. కానీ తాజాగా రామ్ పోతినేని ముంబై ఎయిర్‌పోర్ట్‌లో మెరిశాడు. ఇక ఈ లుక్ చూసిన తర్వాత.. అదిరిపోయిందని అంటున్నారు ఫ్యాన్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. రామ్ లుక్ అద్బుతంగా ఉందంటున్నారు. రగ్గ్డ్ లుక్‌లో గుబురు గడ్డం, మీసాలతో అల్ట్రా స్టైలిష్ మోడ్‌లో ఊర మాస్‌గా ఉన్నాడు. ప్రస్తుతం ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే ఈ లుక్ బోయపాటి శ్రీను సినిమా కోసమేనని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. అందులో ఓ క్యారెక్టర్ కోసమే ఈ నయా లుక్ అంటున్నారు. ఇకపోతే.. ది వారియర్ సినిమాతో మెప్పించలేకపోయిన రామ్, బోయపాటి పై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకోవాలని చూస్తున్నాడు. మరి ఈ క్రేజీ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.