దాదాపుగా హీరో, హీరోయిన్లంతా.. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లైతే ఒకటి రెండు సినిమాల సక్సెస్‌తో కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నారు. ఇక హీరోలైతే అంతకుమించి అనేలా డిమాండ్ చేస్తుంటారు. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో మెప్పిస్తే.. మరింతత భారీగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు యంగ్ హీరో నిఖిల్. ఊహించని విధంగా ‘కార్తికేయ2′ మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నాడు నిఖిల్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాంతో నిఖిల్‌కు డిమాండ్ పెరిగిపోయింది. డిసెంబర్ 23న ’18 పేజెస్’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నిఖిల్. మరోసారి ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్తో రొమాన్స్ చేశాడు.. అందుకే ’18పేజెస్’ పై అంచనాలు బాగానే ఉన్నాయి. నిఖిల్ కూడా పాన్ ఇండియా స్థాయిని కాపాడుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది. మొదట్లో ఒక్కో సినిమాకు 4,5 కోట్లు తీసుకునే నిఖిల్.. ఇప్పుడు డబుల్ పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట. దాదాపు 8 కోట్లు అడుగుతున్నాడట.. మేకర్స్ కూడా నిఖిల్ అడిగినంత ఇవ్వడానికి సై అంటున్నారట. అయితే నిఖిల్ అడిగినంత ఇవ్వాలంటే.. ’18 పేజేస్’ సినిమాతోను హిట్ కొట్టాల్సిందే. లేదంటే మరోసారి కార్తికేయ3తో లక్ చెక్ చేసుకోవాల్సిందే.. మరి నిఖిల్ ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.