డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకొచ్చిన మాస్ మహారాజా ‘ధమాకా’.. మాసివ్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఫస్ట్ వీక్‌లో 62 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు అందుకొని.. బాక్సాఫీస్ దగ్గర రవితేజ సత్తా చాటింది. దాంతో ధమాకా టీమ్ ఫుల్ జోష్‌లో ఉంది.. సక్సెస్ పార్టీ చేసుకుంటున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ అయితే థియేటర్లో మాస్ జాతర చేసుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయి వారం కావొస్తున్నా.. కలెక్షన్లు స్టడిగా ఉన్నాయి. దాంతో ఈ వీకెండ్లో ధమాకా వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉందని మేకర్స్ భావిస్తున్నారు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధమాకా మూవీని కాస్త టెన్షన్ పెడుతున్టట్టే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ ‘ఖుషి’ మూవీ డిసెంబర్ 31న రీ రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే బుకింగ్స్‌లో జోరు చూపిస్తోంది ఖుషి. దాంతో ధమాకా వీకెండ్ కలెక్షన్స్ ఇప్పుడు ఖుషి వైపు మళ్ళబోతున్నాయనే చెప్పొచ్చు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే కోటికి పైగా గ్రాస్ అందుకుందని టాక్. అంతేకాదు.. హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, గుంటూరు లాంటి ప్రాంతాల్లో ఉదయం 5, 6 గంటలకు బెనిఫిట్ షోలు కూడా వేయబోతున్నారట. ఇప్పటికే ఆ టికెట్స్ అన్ని సోల్డ్ అవుట్ అయినట్టు తెలుస్తోంది. దీంతో ఖుషి క్రేజ్ చూసి.. థియేటర్ యాజమాన్యాలు ఏకంగా వారం మొత్తం రోజు నాలుగు ఆటలతో సినిమాను ప్రదర్శించేలా అగ్రిమెంట్లు చేసుకున్నట్టు టాక్. ఇదే జరిగితే.. 21 ఏళ్ల తర్వాత ఖుషి సరికొత్త రికార్డ్ లు క్రియేట్ చేయటం ఖాయమంటున్నారు. ఇక 2001లో రిలీజ్ అయిన ఈ సినిమా.. శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం నిర్మించగా, ఎస్జే సూర్య దర్శకత్వం వహించారు. భూమిక హీరోయిన్గా నటించింది.