ప్రస్తుతం ఎక్కడ చూసిన పవన్-బాలయ్య అన్‌స్టాపబుల్ టాక్ షో గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ క్రేజీ ఎపిసోడ్ షూటింగ్ కూడా అయిపోయింది. ఇందులో పవన్‌ను బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగారు.. పవన్ పర్సనల్ లైఫ్ గురించి అడిగాడా.. పవన్ ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు.. అనే ఆసక్తి అందరిలోను ఉంది. ముఖ్యంగా పవన్ ఎపిసోడ్.. పవర్ ఫుల్ పొలిటికల్ టాక్ షోగా మారనుంది. ఇక అన్స్టాపబుల్తో కిక్ ఇచ్చిన పవర్ స్టార్.. ఈ నెల 31న ఖుషి రీ రిలీజ్‌తో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఈ సినిమాను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అయితే ఈ సినిమా రీ రిలీజ్‌తో పాటే.. పవన్ కొత్త సినిమా ‘హరిహర వీరమల్లు’ నుంచి సరికొత్త గ్లింప్స్ రాబోతుందని చాలా రోజులుగా ప్రచారంలో ఉంది. ఖుషి సినిమాను నిర్మించిన మెగా సూర్య ప్రొడక్షన్స్ హరిహర వీరమల్లును కూడా నిర్మిస్తున్నారు. దాంతో బిగ్ అప్డేట్ రావడం ఖాయమనుకున్నారు. దాంతో ఖుషి థియేటర్లో వీరమల్లు కొత్త గ్లింప్స్‌తో పవన్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదని అనుకున్నారు. కానీ లేటెస్ట్ అప్టేట్ ప్రకారం.. హరిహర వీరమల్లు నుంచి ఎలాంటి కొత్త గ్లింప్స్ రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ విషయంలో పవన్ ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారు. అయితే ఖుషి రీ రిలీజ్‌కు మరో రెండు రోజుల సమయం ఉంది కాబట్టి.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక హరిహర వీరమల్లును పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండగా.. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది.. వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.