»Goosebumps Inducing Glimpses Of Prabhas Project K Title Announced
Project K: గూస్ బంప్స్ తెప్పించే ప్రభాస్ గ్లింప్స్.. ప్రాజెక్ట్ K టైటిల్ అనౌన్స్!
ఎట్టకేలకు ప్రాజెక్ట్k టైటిల్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. కల్కి 2898 ఏడీగా టైటిల్‌ను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ వీడియో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో ప్రభాస్ సాహస వీరుడిగా కనిపిస్తున్నాడు. రోమాలు నిక్కబొడుచుకునే స్టిల్స్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉన్నాయని గ్లింప్స్‌ను చూస్తేనే అర్థమవుతోంది.
సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్K నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ప్రభాస్ ఫస్ట్ లుక్‌పై ఇప్పటికే అనేక భిన్నాభిప్రాయాలు వచ్చాయి. అయితే రిలీజ్ అయిన గ్లింప్స్ వాటన్నింటికీ చెక్ పెట్టేసింది. ప్రాజెక్ట్k వర్కింగ్ టైటిల్‌తో ప్రారంభమైన ఈ సినిమా టైటిల్‌ను కల్కి 2898 ఏడీగా ఖరారు చేశారు. విడుదలైన వీడియోలో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.
ప్రాజెక్ట్ K గ్లింప్స్ వీడియో:
అమెరికాలోని శాన్‌డియాగో కామిక్ కాన్‌లో శుక్రవారం అర్ధరాత్రి ప్రాజెక్ట్k ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గ్లింప్స్ ప్రారంభంలో..ప్రపంచాన్ని చీకటి చుట్టుముట్టినప్పుడు ఓ శక్తి ఉద్భవిస్తుంది అంటూ చెప్పై డైలాగ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వాటీజ్ ప్రాజెక్ట్K అనే డైలాగ్‌తో గ్లింప్స్ వీడియో ముగుస్తుంది. దుష్టశక్తుల చేతిలో సామాన్యులు పడే అవస్థల నుంచి వారిని రక్షించేందుకు ఉద్భవించిన శక్తిగా ప్రభాస్‌ను చూపిస్తారు.