మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) తన భార్య ఉపాసనకు బర్త్ డే విషెస్ తెలిపారు. అలాగే తన కూతురు క్లింకారాకు 1 మంత్ బర్త్ డే విషెస్ చెబుతూ ఓ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశారు. పాప పుట్టే ముందు, పుట్టిన తర్వాత తాము ఎలా ఫీల్ అయ్యామో రామ్ చరణ్ ఈ వీడియోలో తెలిపారు. తమ కూతురు తమకు బెస్ట్ గిఫ్ట్ అని పేర్కొన్నారు. 11 ఏళ్ల నుంచి ఈ అద్భుతమైన క్షణం కోసం ఎదురు చూశామని అన్నారు.క్లీంకార (Klinkara) రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో మనం గమనించవచ్చు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. సదరు చెంచు జాతి ద్రావిడ సంస్కృతిలో భాగం.
వారి సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమయ్యాయి.ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల (Upasana Konidela) మాట్లాడుతూ “మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి. మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను” అన్నారు. వారి కుటుంబాలకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియో(Video)ను ప్రజలకు చూపించటం ద్వారా రామ్ చరణ్, ఉపాసనలను నెటిజన్స్ (Netizens) అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలపై చరణ్, ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.
Celebrating the arrival of their baby girl Klin Kaara, Ram Charan & Upasana Konidela release a touching video featuring special moments & the story behind her unique name. Heartfelt gratitude to everyone for the love & support. 🎥👶🎉 #RamCharan#UpasanaKonidela… pic.twitter.com/IghM4g62Jh