»A Nepali Gang Has Committed A Massive Robbery In Hyderabad The Police Caught Him Before Crossing The Border
Nepali gang: హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీ.. తెలివిగా పట్టుకున్న పోలీసులు.!
హైదరాబాద్ పెరుగుతున్న నెపాల్గ్యాంగ్ల దొంగతనాలు. రామ్‌గోపాల్ పేటలో ఓ ప్రముఖ వ్యాపారి ఇంట్లో భారీ మొత్తం చోరీ చేసి నేపాల్ పారిపోవాలని ప్లాన్ వేశారు. మొత్తంగా సినిమాను తలపించే నాటకీయ పరిణామం తరువాత పట్టుబడ్డారు.
A Nepali gang has committed a massive robbery in Hyderabad. The police caught him before crossing the border.
Nepali gang: హైదరాబాద్‌లో పలుచోట్ల నేపాల్ గ్యాంగ్ (nepali gang)ల దోపిడీలు జరుగుతున్నాయి. ఇటీవలే రాయదుర్గం (Rayadurgam)లోని ఓ ఇంట్లో పనిచేసే వాచ్మెన్ భోజనంలో మత్తు మందు కలిపి ఆ ఇళ్లును దోచేసుకున్నారు. మత్తునుంచి తేరుకున్న ఇంట్లోనివారి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నేపాల్ ఎంటర్ అయ్యేలోపే పోలీసులు వారిని పట్టుకున్నారు. అలాగే కూకట్పల్లి (Kukatpally) వివేకానందనగర్లోనూ నేపాల్ వాచ్మెన్ తన బంధువులతో కలిసి చోరీ చేసినట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా రామ్‌గోపాల్‌పేట్ (Ramgopalpet) లో భారీ చోరీ జరిగింది. ఆరేళ్లుగా సింధీ కాలనీ (Sindhi Colony) లోని వ్యాపారి రాహుల్ గోయల్ ఇంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న శంకర్ మాన్ సింగ్ అలియాస్ కమల్ ఆ కుటంబానికి ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. రాహుల్ గోయల్ తన ఫ్యామిలీతో శివార్లలోని ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. ముందే విషయం తెలుసుకున్న కమల్ తన బంధువులను ఫోన్ చేసి పిలిపించాడు. మొత్తం పదమూడు మంది పూనే నుంచి వచ్చారు. పార్టీ చేసుకున్న అనంతం ప్లాన్‌ను అమలు పరిచారు. రాహుల్ గోయల్ ఇంట్లోని 8 బెడ్రూముల్లో ఉన్న నగలు, నగదుతో పాటు విదేశీ కరెన్సీని మొత్తం దాదాపు ఐదు కోట్ల విలువైన సొమ్మును బ్యాగుల్లో నింపుకుని, వాటలుగా పంచుకొని ముంబైకి పారిపోయారు. విషయం తెలసుకున్న ఇంటివారు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు వేట మొదలు పెట్టారు. పదిరోజులు పోలీసులనే ముప్పుతిప్పలు పెట్టించారు.
సీసీ కెమెరా(CC camera)ల్లో నిందితుల కదలికలను గుర్తించిన పోలీసులు, పూనే, ముంబై, బెంగళూరుకు టీమ్‌లుగా వెళ్లారు. అయితే వీరు వెళ్లిన నాటికి వారు ఇళ్లు కాళీ చేసీ నేపాల్‌కు ఓ ఇన్నోవాలో వెళ్లారని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే హైదరాబాద్ నుంచి ఓ ఎస్సైని నేపాల్ బార్డర్‌కు పంపించారు. బార్డర్లో ఉన్న సహస్ర సీమా భల్(Sahasra Seema Bhal) సిబ్బందికి నిందితుల ఫోటోలు చూపెట్టి చోరీ విషయాన్ని చెప్పారు. రాచకొండ సీపీ చౌహాన్‌కు ఎస్ఎస్బీ అధికారులతో మాట్లాడారు. నిందితులను నేపాల్ బార్డర్ దాటించేందుకు దీపక్ అనే ఓ వ్యక్తి నేపాల్ సరిహద్దులకు వచ్చాడు. కాని అక్కడ పోలీస్ మూమెంట్ చూసి.. అతను మల్లీ నేపాల్‌లోకి వెళ్లిపోయాడు. చివరకు ఏ-1 నిందితుడు కమల్‌తో పాటు అతని భార్యా, మరో నిందితుడు ముగ్గురూ డబ్బు, నగలతో నేపాల్ బార్డర్ దాటేందుకు ప్రయత్నించారు. అప్పటికే అక్కడి ఎస్ఎస్బీ సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. మిగతా వారిని హైదరాబాద్‌లో పట్టుకున్నారు. మొట్ట మొదటిసారిగా నేపాలీ గ్యాంగ్ నుంచి సొమ్ము రికవరీ చేసినట్టు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. దొంగలను పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.