శృంగార భాగస్వామి (Partner)ఎలా మనల్ని రంజింప చేస్తారో.. ఆ రీతిలోనే ఏఐ ఆధారిత సెక్స్ రోబోలు కూడా మనల్ని థ్రిల్ చేస్తాయని గవాదత్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నిజమైన భాగస్వామితో ఎంత ఎంజాయ్(enjoy) చేస్తామో.. ఆ స్థాయిలోనే సెక్స్ రోబోలు కూడా మనల్ని మైమరిపింప చేస్తాయట. వర్చువల్ రియాల్టీ హెడ్సెట్స్తో ఇలాంటి అనుభవాలు మనకు కలుగుతాయని గవాదత్ వెల్లడించారు. కృత్రిమ మేధ అభివృద్ధి చెందుతున్నా కొద్దీ.. నిజమైన, అవాస్తవిక బంధాల మధ్య వ్యత్యాసం తగ్గుతుందన్నారు. మనుషుల్లో ఉండే ప్రేమ, ఇతర భావాలకు సంబంధించిన ఎమోషన్స్ (Emotions) కనుమరుగవుతాయన్నారు.మానవ సంబంధాలు చాలా సంక్లిష్టమైనవి. ఆ సంబంధాలను అర్ధం చేసుకోవడం అంత సులువు కాదు.
అయితే ఏఐలో ఉండే అడ్వాన్స్మెంట్(Advancement).. మన మానసికమైన భావాలను చాలా సునాయాసంగా అంచనా వేయగలదన్నారు. స్నేహితులతో ఉన్నామా, ప్రేమలో ఉన్నామా అన్న విషయాన్ని అది చెప్పేయగలదని గవాదత్ తెలిపారు. రోబో(Robot)లకు మనుషుల్లా ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉంటాయా అన్న ఆలోచనలు అవసరం లేదని, ఎందుకంటే ఏఐ(A.I)తో బలమైన బంధాన్ని ఏర్పర్చుకుంటే, అప్పుడు ఆ రిలేషన్ నిజమా, అబద్దామా అన్న భావన అవసరం లేదని గూగుల్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు.ప్రేమ, సంబంధాల గురించి ఏఐ చాలా విభిన్నరీతిలో ఆలోచిస్తుందని గవాదత్ అన్నారు. టెక్నాలజీ (Technology)మెరుగు అవుతున్నా కొద్దీ.. మనుషులు.. కృత్రిమ సంబంధాల మధ్య తేడాను గుర్తించలేమన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ ఆధారిత భాగస్వామ్యలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. సమాజం వీటిని ఆమోదిస్తుందన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.