పేపర్ లీకేజీలో టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని వారు ఆరోపించారు. పేపర్ లీకేజీ ఘటనకు బాద్యత వహిస్తూ, సీఎం కేసీఆర్, టీఎస్పీఎస్సీ రాజీనామా చేయాలన్నారు. పేపర్ లీక్ ఘటనపై సిట్టింగ్ జడ్జితో(Sitting Judge) విచారణ జరిపించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. TSPSC ని మొత్తం ప్రక్షాళన చేయాలన్నారు. మొత్తం ఎన్ని పరీక్షల పేపర్లు లీకేజీ చేశారో ఆయా పరీక్షలను మొత్తం రద్దు చేసి మళ్ళీ పరీక్షలను నిర్వహించాలని కోరారు.పేపర్ లీక్ కేసులో ఇప్పటికే 9 మంది నిందితులకు నాంపల్లి కోర్టు (Nampally Court) 14 రోజుల రిమాండ్ విధించింది. ఏఈ పరీక్షను(AE Exam) రద్దుచేయాలా వద్దా అనేదానిపై టీఎస్ పీఎస్సీ కాసేపట్లో నిర్ణయం తీసుకోనుంది.