ప్రస్తుతం బాలయ్య, ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ ఇద్దరిని ఒకే వేదిక పై చూసేందుకు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఆహా టీమ్ రిలీజ్ చేసిన ఫోటోలకే ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఎపిసోడ్ టెలికాస్ట్ అయితే.. నెక్ట్స్ లెవల్ అంటున్నారు. రీసెంట్గా ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో కోసం.. ప్రభాస్, గోపీచంద్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ చేశారు. ఈ ఇద్దరు స్టిల్స్ కూడా రిలీజ్ చేశారు. అందులో ప్రభాస్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఎక్కడికి వెళ్లినా మంకీ క్యాప్ పెట్టుకుని కనబడుతున్నారు ప్రభాస్. కానీ బాలయ్య షోకు క్యాప్ లేకుండా వచ్చారు. చాలా రోజుల తర్వాత కొత్త హెయిర్, కాస్త గెడ్డంతో స్మార్ట్ లుక్‌లో కపించాడు ప్రభాస్. ఈ లుక్ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చింది. ముఖ్యంగా కలర్ ఫుల్ షర్ట్‌లో ప్రభాస్‌ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాంతో ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో ప్రభాస్ పోటోలే కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ వేసుకున్న షర్ట్ ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ షర్ట్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేయగా.. దాని బ్రాండ్ అండ్ కాస్ట్ డీటేల్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారింది. ప్రభాస్ వేసుకన్న షర్ట్.. ‘పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్’ అని తెలుస్తోంది. దీని కాస్ట్ వచ్చేసి 115 పౌండ్స్ అంటున్నారు. అంటే.. ఇండియన్ కరెన్సీలో 11 వేలకు పైగా ఉంటుందని చెప్పొచ్చు. గతంలో కూడా ప్రభాస్ వేసుకున్న టీ షర్ట్ ధర వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు ఈ కలర్ ఫుల్ షర్ట్.. అన్‌స్టాపబుల్‌గా మారిపోయింది. దాంతో బాలయ్య, ప్రభాస్, గోపీచంద్.. ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.