మేషరాశికి జన్మరాశియందు శుక్ర, రాహువులు మరియు వ్యయస్థానమునందు రవి, బుధ, గురులు సంచారంచేత పనులు యందు ఆలస్యము మానసిక ఒత్తిళ్ళు మరియు శారీరక శ్రమ అధికముగా ఉండును. ఖర్చులు అధికమగును. ధన నష్టము సూచనలు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి.
మేషం రాశి : ఈ రోజు మీ స్నేహితులతో వ్యాపారపరమైన చర్చలతో మధ్యాహ్నాన్ని గడుపుతారు. మీ ఆత్మబంధువు నుంచి అందే ప్రత్యేక ఆతిథ్యంతో మీరు మురిసిపోతారు. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి.
వృషభ రాశి : ఈ రోజు సమస్యలు పరిష్కరించడం చాలా కఠినంగా ఉంటుంది. కానీ మీరు వాటిని పూర్తి చేస్తారు. దానికి కొంత సమయం పడుతుంది, నిరాశ చెందకండి. కఠిన శ్రమ, సహనం ఫలితాన్ని ఇస్తుంది. మీరు ప్రియమైన వ్యక్తిని షాపింగ్‌కు తీసుకెళ్తారు.వ్యాపారస్తులకు వ్యాపారమునందు లాభములు కలుగును. వృషభరాశి వారికి వాక్ స్థానమునందు కుజుని సంచారం వలన గొడవలు, వాగ్వివివాదములకు దూరంగా ఉండాలి.
మిథున రాశి : మీరు ఈ రోజు చాలా ప్రశాంతంగా ఉండండి. ప్రయాణంలో అలిసిపోయినా, మీరు చేస్తున్న పనిలో అలసట చెందినా కాస్త బ్రేక్ తీసుకోండి. శరీరం మళ్లీ నూతనోత్సాహం పుంజుకోవాలి. మంచి ఆహారం తీసుకోండి. షాపింగ్ విషయంలో ఎక్కువ ఖర్చు అవుతుంది. జాగ్రత్త వహించండి. ఆరోగ్య విషయమునందు జాగ్రత్తలు వహించాలి.
కర్కకటం: ఈ రోజు మీరు మీ సిద్ధాంతాలతో రాజీపడరు. అలా ఉన్నందుకు మీరు చాలా సంతృప్తి చెందుతారు. కానీ రాజీ ధోరణిని విడవకండి. అది మీ వృత్తిపరమైన వ్యవహారాల్లో సాయపడుతోంది.. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి.
సింహారాశి : కొన్ని చికాకు కలిగించే విషయాల కారణంగా మీరు ఈ రోజు చిటపటలాడుతూ ఉంటారు. మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచేందుకు ఏదో ఓ కోర్సులాంటిదానిలో మీరు చేరే సూచనలున్నాయి. మీరు జరిపే సన్నిహిత సంభాషణ సంతోషానికి దారితీస్తుంది.సింహరాశి ఉద్యోగస్తులకు అనుకూలము. వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడుచున్నవి. విద్యార్థులకు జాగ్రత్త వహించవలసినటువంటి సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.
కన్యరాశి : పాత జ్ఞాపకాలను మీరు నెమరువేసుకుంటారు. అందులోని మధురమైన వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. శ్రేయోభిలాషులతో కలిసి మీ ఆలోచనలను పంచుకొని చర్చిస్తారు. వేదాంతం, మతం వంటి విభిన్నమైన విషయాలపై మీరు చర్చిస్తారు. గతాన్ని తలుచుకోవడం కన్నా ప్రస్తుతం విషయాలపై దృష్టి సారించి ఆనందంగా ఉండాల్సిన సమయమిది.కుటుంబమునందు కొంత చికాకులు అధికముగా ఉండును. దశమంలో కుజుని అనుకూలత వలన ఉద్యోగస్తులకు లాభదాయకముగా ఉండును
తులరాశి : ఈ రోజు ఎన్నో ఆశ్చర్యాలను మీరు చూస్తారు. ఆ రహస్యాలన్నీ ఒక్కొక్కటిగా విడగొట్టాల్సిన సమయం ఇది. వృత్తిపరమైన, వ్యాపారపరమైన చర్చల్లో నిర్ణయం తీసుకోవాల్సిన వంతు మీపై ఉంటుంది. ఆరోగ్య విషయాల యందు కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి
వృశ్చిక రాశి : ఈ రోజు మీ స్నేహితులతో కలిసి విపరీతంగా షాపింగ్ చేస్తారు. సంతోషంగా బాగా గడపండి. ప్రయాణములు అనుకూలించును. శారీరక శ్రమ అధికముగా ఉండును. వివాదములకు దూరంగా ఉండాలి
ధనుస్సు రాశి : గతంలో చేసిన పొరపాట్ల గురించి ఈ రోజు మీరు ఆలోచిస్తుంటారు. కొన్ని విషయాల్లో మీ ప్రయత్నాలు ఎవరి కంటపడవు. మీరు ఎటువంటి ప్రశంసలు పొందరు. ఇది మీకు నిరాశ కలిగిస్తుంది. కాని మీ విలువేంటో మీకు తెలుసు. కాబట్టి దాని గురించి మీరు ఎవరికి ఫిర్యాదు చేయరు.ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.
మకర రాశి : ఈ రోజు మీ స్నేహితులతో కలిసి మీరు ఆడతారు, పాడతారు, వేదాంతం, విలువలు, రాజకీయాల గురించి కూడా మాట్లాడుతారు. మీ భాగస్వామితో కలిసి రెస్టారెంట్ లేదా బీచ్‌లో ఆహ్లాదకరమైన సాయంత్రం గడుపుతారు.వివాదాలు, మానసిక ఘర్షణలు అధికమగును.
శుభం రాశి : మీరు భౌతిక స్థితుల నుంచి ఆధ్యాత్మిక స్థితుల వైపు ప్రయాణం చేస్తుంటారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. చివరగా మీరు లీగల్ వ్యవహారాలు సెటిల్ చేసుకుంటారు. మధ్యాహ్నం నుంచి మీకు అన్ని విషయాల్లోనూ విజయం వరిస్తుంది. మీ ఆరోగ్యం ఈ రోజు బాగా ఉంటుంది. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి
మీనం రాశి : ఈ రోజు మీ నిర్ణయాల ప్రభావం దీర్ఘకాలం ఉంటుంది. అందులో ఆర్థికపరమైన విషయాలు కూడా ఉంటాయి. కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా మేము సూచిస్తున్నాం. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు చెడు సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు కష్ట సమయము. కోర్టు విషయాల యందు జాగ్రత్తలు వహించాలి